Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నకిలీ వెబ్‌సైట్ల మాయాజాలం.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు..

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డిజిటల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, తదితర రంగాలు దూసుకెళ్తున్నాయి. అయితే సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్ లను ఆశ్రయించడం సాధారణంగా మారింది. అయితే ఈ అలవాటే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది. సెర్చ్ ఇంజిన్ వెబ్ సైట్లలో అగ్రస్థానంలో కనిపించినంత మాత్రాన అది అసలైన, సురక్షితమైన వెబ్‌సైట్ అని గుడ్డిగా నమ్మితే మోసపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ఆన్‌ లైన్ మోసాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లలో వెతకడం మనకు అలవాటు. అయితే, ఈ అలవాటే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. సెర్చ్ ఇంజిన్లలో టాప్‌లో కనిపించే వెబ్‌సైట్లు లేదా 'స్పాన్సర్డ్' అని ఉన్న లింకులు అన్నీ సురక్షితమైనవి కావని గుర్తించాలి. కేవలం సెర్చ్ ఫలితాల్లో పైన కనిపించినంత మాత్రాన అది అసలైన వెబ్‌సైట్ అని గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంది.

నకిలీ వెబ్‌సైట్ల మాయాజాలం..

సైబర్ ముఠాలు ఇప్పుడు అధునాతన 'సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్' (ఎస్ఈఓ) పద్ధతులను, పెయిడ్ యాడ్స్‌ను ఆసరాగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పోర్టల్స్, బ్యాంకులు, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో అచ్చం అసలైన వాటిని పోలి ఉండే 'ఫిషింగ్' వెబ్‌ సైట్లను సృష్టిస్తున్నాయి. వీటిని సెర్చ్ రిజల్ట్స్‌ లో అగ్రస్థానంలో ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్ల కోసం లేదా పేమెంట్ సర్వీసుల కోసం వెతికినప్పుడు, ఈ నకిలీ లింకులు పైన కనిపిస్తాయి. అవి నిజమేనని నమ్మి క్లిక్ చేయగానే మోసం మొదలవుతుంది.

వివరాలు ఇచ్చారో.. విలవిలలాడాల్సిందే..!

ఈ నకిలీ వెబ్‌సైట్లలోకి వెళ్లిన వెంటనే మీ వ్యక్తిగత వివరాలు, లాగిన్ పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంకింగ్ వివరాలను నమోదు చేయమని అడుగుతారు. ఒకసారి మీరు ఆ సమాచారాన్ని ఇస్తే, క్షణాల్లో మీ ఖాతా ఖాళీ అయిపోతుంది. కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, మీ పేరిట ఉన్న డాక్యుమెంట్లను దొంగిలించి 'ఐడెంటిటీ థెఫ్ట్'కు పాల్పడే అవకాశం కూడా ఉంది.

Sajjanar hyd cp Alert How Fraudsters Create Magic Fake Websites via SEO amp amp Ads Stay Safe

రక్షణ మార్గాలు ఇవే..

యూఆర్‌ఎల్ చెక్ చేయండి. వెబ్‌సైట్ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. స్పెల్లింగ్ చిన్న తేడా ఉన్నా అది నకిలీదని గుర్తించాలి.. నేరుగా టైప్ చేయండి. సెర్చ్ ఇంజిన్లలో వెతకడం కంటే, అధికారిక వెబ్‌సైట్ చిరునామా తెలిస్తే నేరుగా అడ్రస్ బార్‌లో టైప్ చేయడం సురక్షితం.. సెర్చ్ రిజల్ట్స్‌లో 'Sponsored' లేదా 'Ad' అని ఉంటే వాటిని క్లిక్ చేసేటప్పుడు రెట్టింపు అప్రమత్తత అవసరం.. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి.. ఆన్‌లైన్ ప్రపంచంలో అప్రమత్తతే మీకు రక్షణ కవచం!.." అని వీసీ సజ్జనార్ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+