ఇదెక్కడి పిచ్చి! బావి అంచున కూర్చుని చిన్నారితో మహిళ రిస్కీ రీల్, సజ్జనార్ ఫైర్

సోషల్ మీడియా.. అవసరమైన విషయాలు తెలిసినవారితో పంచుకునేందుకు ఏర్పడిన వేదికలు. అంతేగాక, సమాజంలో జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే, ఇప్పుడు సోషల్ మీడియా అవసరంగా కాకుండా వ్యసనంగా మారిపోయింది చాలా మందికి. చిన్నవారి నుంచి పెద్దల వరకు రోజులో ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలోనే ఉంటూ వాటికి బానిస అయిపోతున్నారు. మరికొందరు రీల్స్ పేరిట పిచ్చివేశాలు వేస్తున్నారు. ఇంకొందరు ప్రాణాలు పణంగా పెట్టి లైక్స్ పొందాలి చూస్తున్నారు.

తాజాగా, ఇలాంటిదే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ బావి గోడ అంచున కూర్చుని చిన్నపిల్లాడితో ప్రమాదకరంగా రీల్స్ చేసింది. బావి గోడ అంచున కూర్చొన్న ఆమె.. సుమారు రెండు మూడేళ్ల పిల్లాడిని బావి లోపలి వైపునకు ఉంచి అతని చేతిని పట్టుకుంది. అటు ఇటు అతడ్ని తిప్పుతూ ప్రమాదకరంగా రీల్స్ చేసింది. ఏదైనా పొరపాటు జరిగితే ఆ చిన్నారి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది.

Sajjanar slams at Risky reel of a woman with a child sitting on the edge of a well

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మహిళపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడిందంటూ మండిపడుతున్నారు. ఆ బాలుడు ఎంత భయాందోళనకు గురై ఉంటాడో అని అంటున్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగిన పిల్లాడితోపాటు ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగి ఉండేదని.. లైక్స్ కోసం ఇలాంటి రిస్క్ తీసుకోవడం అవసరమా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సదరు మహిళా వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆమె వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేసిన ఆయన.. పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు అవసరమా? అని మండిపడ్డారు. ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు. సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి అని వీసీ సజ్జనార్ హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+