Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓలా షోరూంకు చెప్పుల దండ వేసిన కస్టమర్: ఎందుకంటే?

సర్వీసింగ్‌కు తన ద్విచక్ర వాహనాన్ని నెలలు గడిచినా తిరిగి ఇవ్వకపోవడంతో విసిగిపోయాడు ఓ కస్టమర్. ఈ నేపథ్యంలోనే ఓలా మోటారు సంస్థకు చెందిన సర్వీస్ సెంటర్‌కు ఏకంగా చెప్పుల దండ వేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఓలా మోటార్ సంస్థ నుంచి ఎలక్ట్రిక్​ టూవీలర్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దాన్ని సర్వీసింగ్ చేయించాలని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్​ నగర్‌​లో ఉన్న షోరూం సర్వీస్ సెంటర్​కు తీసుకొచ్చాడు. తర్వాత రెండు, మూడు సార్లు వెళ్లినా సర్వీస్ సెంటర్ సిబ్బంది అతనికి తన వాహనాన్ని ఇవ్వలేదు. అడిగితే సరిగా స్పందన కూడా రాలేదు.

Sangareddy A customer who brought sandal garland to the Ola showroom for protest

ఓలా షోరూం సిబ్బంది తన బైక్ సర్వీసింగ్ చేయకుండా కొన్ని నెలలుగా తిప్పించుకుంటున్నారని విసుగు చెందిన సంతోష్​ కుమార్.. శుక్రవారం షోరూం గ్లాస్​ డోర్​‌కు చెప్పుల దండ వేసి నిరసన తెలిపాడు. ఓలా సంస్థను బ్యాన్ చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో ఓలా షోరూం ప్రతినిధులకు, సంతోష్​‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తనను కొన్ని నెలలుగా తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప తన బైక్‌​ను సర్వీసింగ్ చేయడం లేదని సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓపిక నశించే ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు.

తాను కొత్త ద్విచక్ర వాహనం తీసుకున్న సమయంలో కూడా ఇదే మాదిరిగా ఆలస్యం చేశారని వాపోయాడు. కాగా, ఈ వ్యవహారంపై షోరూం సిబ్బంది స్పందించాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. మంచి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా సంస్థ.. పెద్ద ఎత్తును వాహనాలను విక్రయిస్తోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలా సర్వీసింగ్ విషయంలో ఫిర్యాదులు రావడం గమనార్హం. పదివేలకుపైగా ఫిర్యాదు రావడంతో కేంద్ర పరిశ్రమల శాఖ ఈ విషయంపై సీరియస్ అయ్యింది. అంతేగాక, ఓలా సర్వీస్ సెంటర్ల ఆడిట్‌కు ఆదేశించడం గమనార్హం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+