సంక్రాంతికి వారికి బిగ్ న్యూస్.. లక్షరూపాయల వరకు రుణమాఫీ!

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగత రుణాలు తీసుకున్న చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయనుందని హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నిర్ణయం అర్హులైన కార్మికుల పైన అధిక భారాన్ని తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

చేనేత కార్మికులపై ఉన్న లక్ష రూపాయల వరకు రుణాల మాఫీ
ఇప్పటివరకు చేనేత కార్మికులపై ఉన్న లక్ష రూపాయల వరకు రుణాలను పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఈ చర్య ద్వారా వారిపై ఉన్న అప్పుల భారాన్ని తొలగించి వారికి ఆర్థికంగా భరోసా ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం వివిధ రంగాలలో ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు.

Sankranthi Gift for Handloom Workers Telangana Govt Announces Loan Waiver up to Rs 1 Lakh

చేనేత కార్మికులకు ఆర్ధిక భరోసా
ఇదే క్రమంలో తెలంగాణలో కూడా చేనేత వృత్తి వారికి ఆర్థికభరోసా కల్పిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలలో ఇందిరమ్మ చీరల పథకం, చేనేత భరోసా, పొదుపు పథకం వంటి పథకాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు గా మంత్రి తుమ్మల స్పష్టం చేశారు ఒక పక్కన చేనేత కార్మికులకు పని కల్పించడం మాత్రమే కాక, వారికి అనేక రాయితీలను ప్రకటించి ఊరట కల్పిస్తున్నట్టు తెలిపారు.

సుమారు 6784మంది చేనేత కార్మికులకు నేరుగా ప్రయోజనం
2017 నుంచి 2024వరకు రుణమాఫీ కోసం మొత్తం 27.14కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 6784మంది చేనేత కార్మికులు నేరుగా ప్రయోజనం పొందారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రుణమాఫీ ప్రక్రియతో పాటుగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం, ఉపాధి భద్రత కోసం ఇతర పథకాలను కూడా అమలు చేస్తున్నామని, ప్రభుత్వ అడుగడుగునా నేతన్నలకు అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

సుమారు 303 కోట్ల రూపాయలను ఆ పథకానికి కేటాయింపు
నేతన్నల భవిష్యత్తు అవసరాల కోసం అమలు చేస్తున్న చేనేత భరోసా మరియు పొదుపు పథకం కింద సుమారు 303 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఇక చేనేత కార్మికులు తీసుకునే రుణాలపైన వడ్డీ భారం లేకుండా పావలా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో భాగంగా టెస్కో ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు భరోసా కల్పిస్తోంది.

చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వ చర్యలు
ఇప్పటివరకు 587 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. కార్మికులకు నేరుగా ఆదాయ వనరులు కలిగేలా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉండేలా అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+