హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే వారికి ఆల్టర్నేటివ్ రూట్స్ చూపించిన పోలీసులు
Sankranti 2025: ఇంకో రెండు రోజుల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొనబోతోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమౌతోన్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది.
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ ఖాళీ అవుతోంది. స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ రోడ్లు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకూ పఠాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్ మొదలుకుని కూకట్‌పల్లి, ఎస్ఆర్‌నగర్, అమీర్‌పేట్ బస్టాప్‌లన్నీ ప్రయాణికులతో క్రిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల తాకిడితో వాహనాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి.

తెలంగాణ, ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రయాణికుల కోసం రెండు రాష్ట్రాల మధ్య వందలాది ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్నాయి. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకూ ఈ బస్సులు అందుబాటులో ఉంటోన్నాయి. మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లలల్లో ప్రయాణికుల తాకిడి కనిపిస్తోంది.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి అటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 52 అదనపు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి స్టేషన్ నుంచీ ఆయా రైళ్లు ఏపీ, తెలంగాణల్లో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తోన్నాయి.
ప్రత్యేకించి.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలు పెద్ద ఎత్తున స్తంభిస్తోన్నాయి. గంటల కొద్దీ పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సిటీ దాటడానికే ఎక్కువ సమయం పడుతోంది. ఉప్పల్ చౌరస్తా, ఎల్బీనగర్ జంక్షన్లల్లో గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని రాచకొండ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. పెద్ద అంబర్‌పేట్ ట్ (ఎగ్జిట్- 11) నుండి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు సంక్రాంతి పండగ వల్ల వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం మూలాన వేరే మార్గాలు సూచించారు.
ఘట్కేసర్ (ఎగ్జిట్-9) నుండి భువనగిరి - వలిగొండ- రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చని రాచకొండ పోలీసులు సూచించారు. అలాగే- గుంటూరు వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు బొంగులూరు గేట్ (ఎగ్జిట్- 121) నుండి ఇబ్రహీంపట్నం - మాల్ - దేవరకొండ మీదుగా చేరుకోవచ్చని పేర్కొన్నారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications