చర్లపల్లి- తిరుపతి మధ్య సంక్రాంతి స్పెషల్ రైళ్లు: హాల్ట్ స్టేషన్లు ఇవే..!!
Special Trains: ఇంకొద్ది రోజుల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొనబోతోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమౌతోన్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు 52 అదనపు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడతో పాటు కొత్తగా ప్రారంభం కాబోతోన్న చర్లపల్లి నుంచీ ఆయా రైళ్లు ఏపీ, తెలంగాణల్లో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి.

చర్లపల్లి- తిరుపతి (6వ తేదీ), తిరుపతి- చర్లపల్లి (7వ తేదీ), చర్లపల్లి- తిరుపతి ( 8,11,15 తేదీలు), వికారాబాద్- కాకినాడ టౌన్ (13వ తేదీ), కాకినాడ టౌన్- చర్లపల్లి (14వ తేదీ), కాచిగూడ- తిరుపతి (9, 16 తేదీలు), తిరుపతి- కాచిగూడ (10, 17 తేదీలు), చర్లపల్లి- నర్సాపూర్ (11, 18 తేదీలు), నర్సాపూర్- చర్లపల్లి (12, 19 తేదీలు) మధ్య రాకపోకలు సాగిస్తాయి.
సికింద్రాబాద్- కాకినాడ టౌన్ (12, 19), చర్లపల్లి- నర్సాపూర్ (7,9,13,15,17), నర్సాపూర్- చర్లపల్లి (8,10,14,16,18 తేదీలు), కాకినాడ టౌన్- చర్లపల్లి (9,11,13,15 తేదీలు), నాందెడ్- కాకినాడ టౌన్ (6, 13 తేదీలు), కాకినాడ టౌన్- నాందెడ్ (7, 14 తేదీలు), చర్లపల్లి- శ్రీకాకళం రోడ్ (9, 12, 14 తేదీలు), శ్రీకాకుళం రోడ్- చర్లపల్లి (10, 13, 15 తేదీలు) మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
6, 7 తేదీల్లో చర్లపల్లి- తిరుపతి మధ్య రాకపోకలు సాగించే నంబర్ 07077/07080 రైళ్లకు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల్లో హాల్ట్ సౌకర్యం ఉంది.
8, 11, 15 తేదీల్లో చర్లపల్లి- తిరుపతి మధ్య నడిచే 02764/02763 రైళ్లు జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల డిమండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు మార్గాల్లో తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు.












Click it and Unblock the Notifications