మరో మలుపు: చంపేశారని డాక్టర్ శశికుమార్ భార్య ఆరోపణ
హైదరాబాద్: తన భర్తది ఆత్మహత్య కాదని, తన భర్తను చంపేశారని డాక్టర్ శశికుమార్ భార్య క్రాంతి ఆరోపిస్తున్నారు. తనతో ఫామ్ హౌస్ నుంచి శశికుమార్ మాట్లాడినట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె కొట్టి పారేశారు. హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌లో సోమవారం సాయంత్రం జరిగిన డాక్టర్ల కాల్పుల ఘటన మరింత మిస్టరీగా మారింది.
తన భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించారని శశికుమార్ భార్య మంగళవారంనాడు మీడియాతో చెప్పారు. వాళ్లు రమ్మన్నారు, వెళ్తున్నానని నిన్న మధ్యాహ్నం తనకు చెప్పి శశికుమార్ బయటకు వెళ్లారని ఆమె చెప్పారు. వారితో ఏడాది, ఏడాదిన్నరగా తమ భర్తకు గొడవలున్నాయని ఆమె చెప్పారు.

తాను నిన్న సాయంత్రం తన భర్తకు ఫోన్ చేస్తే స్విచాఫ్ ఉందని, చాలా సార్లు ఫోన్ చేశానని, అయినా రింగ్ కాలేదని చెప్పారు. వందశాతం తన భర్తది హత్యేనని, అందరూ కలిసి చంపేశారని ఆమె ఆవేదన చెందారు.
మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్ ఎవరిదో కూడా తనకు తెలియదని ఆమె చెప్పారు. చంద్రకళ మధ్యలో ఎలా వచ్చిందనేది కూడా తెలియడం లేదు. ఆమె శశికుమార్‌ను అతని విజ్జప్తి మేరకు ఫామ్ హౌస్‌లో వదిలిపెట్టి వచ్చినట్లు చెబుతున్నారు. తన భర్తది లైసెన్డ్ వెపన్ అని, ఎప్పుడూ వెంటే ఉంటుందని క్రాంతి చెప్పారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె అన్నారు. ఆస్పత్రిలో తన భర్త రెండున్నర కోట్లు పెట్టుబడి పెట్టాడని ఆమె చెప్పారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications