Satavahana Express: శాతవాహన ఎక్స్ ప్రెస్ కు ఓ తాత్కాలిక హాల్ట్..!
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం నడుపుతున్న శాతవాహన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు (satavahana express)కు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఓ తాత్కాలిక హాల్ట్ ఇచ్చారు. ఈ రైలు ప్రయాణించే మార్గంలో ఉన్న జములాపురంలో వెంకటేశ్వరస్వామి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ తాత్కాలిక హాల్ట్ ను కేటాయించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఈ హాల్ట్ ప్రయాణికులకు అందుబాటులో ఉండబోతోంది.
విజయవాడ-సికింద్రాబాద్ మార్గంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ ఉంది. దీనికి సమీపంలో ఉన్న జములాపురం వెంకటేశ్వరస్వామి ఉత్సవాలు ఈ మూడు రోజుల పాటు జరగబోతున్నాయి. వీటికి ఏపీ, తెలంగాణ నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఎర్రుపాలెం స్టాప్ ను తాత్కాలికంగా కేటాయిస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే ఈ మూడు రోజుల పాటు మాత్రమే విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలుకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నెల 4వ తేదీ నుంచి మాత్రం ఈ హాల్ట్ ఉండదు. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే ప్రయాణికుల అవసరాల్ని బట్టి మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు అధికారులు ఈ ప్రకటనలో తెలిపారు.














Click it and Unblock the Notifications