Holidays: వరుసగా నాలుగు రోజులు సెలవులు..!

విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు నాలుగు రోజుల పాటు హాలీడేస్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 14న రెండో శనివారం సెలవు ఉండనుంది. ఇక సెప్టెంబర్ 15న ఆదివారం ఎట్లాగు హాలీడే, ఇక సెప్టెంబర్ 16న సోమవారం మిలాద్ ఉన్ నబీ సెలవు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17న నిమజ్జనం సందర్భంగా హాలీడే ఇవ్వనున్నారు. దీంతో నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.

ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16న మిలాద్ ఉల్ నబీ సెలవు ఉంది. సెప్టెంబర్ 16న మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు. అయితే నెలవంక కనబడినప్పుడే పండుగ చేసుకుంటారు. అయితే ప్రభుత్వం మిలాద్ ఉల్ నబీని సెప్టెంబర్ 16న సెలవు రద్దు చేసి దీన్ని సెప్టెంబర్ 17కు మార్చింది. ఒక వేళ సెప్టెంబర్ 16 సోమవారం నెలవంక కనిపిస్తే అదే రోజు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే వరసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.

School students are allowed four consecutive days off

వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తే శుక్రవారం సాయంత్రం, శనివారం హైదరాబాద్ లోని బస్టాండ్లు రద్దీగా మారే అవకాశం ఉంది. మంగళవారం నిమజ్జనం ఉండడంతో చాలా మంది ఊళ్లకు వెళ్లే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ 14, 15, 17 సెలవులు పక్కా అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెలలో సెప్టెంబర్ 1న ఆదివారం, సెప్టెంబర్ 7న వినాయక చవితి, ఆ తర్వాత ఆదివారం, ఇప్పుడు రెండో శనివారం, ఆదివారం, మిలాద్ ఉన్ నబీ, నిమజ్జనం, సెప్టెంబర్ 22, 29 ఆదివారాలు కలిపితే.. 7 లేక 8 రోజులు సెలవులు అయ్యాయి.

ఇక వచ్చే నెల విద్యార్థులకు పండగే.. వచ్చే నెలలో బతుకమ్మ, దసరా ఉండడంతో భారీగా సెలవులు రానున్నాయి. దాదాపు 10 రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ 2న చిన్న బతకమ్మతో సెలవులు ప్రారంభ అయి దసరా వరకు సెలువులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+