తెలంగాణాలో తెరచుకున్న స్కూల్స్.. నేటి నుండే అల్పాహార పథకం.. పండుగే!

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం నేటి నుంచి (జూన్ 15) అధికారికంగా ప్రారంభమైంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించిన సీఎం అల్పాహార పథకం విద్యార్థుల్లో సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఇది కేవలం భోజనం కాదు, విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మరియు హాజరును పెంచే ఒక మహత్తరమైన కార్యక్రమం.

నేటి నుండి స్కూల్స్, కాలేజీలలో విద్యార్థులకు అల్పాహార పథకం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలలు నేటి నుంచి తమ కార్యాకలాపాలను ప్రారంభించాయి. తొలి విడతలో సుమారు 1,300 పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో 1.44 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం మొదలైంది. త్వరలో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

schools reopen for The 2026-27 academic year in Telangana breakfast scheme started for students today

అల్పాహార పథకానికి రూ.720 కోట్లు

ఈ అల్పాహార పథకంలో విద్యార్థులకు వారానికి వివిధ రకాల పోషకమైన టిఫిన్లు అందించనున్నారు. రాగి మాల్ట్, పాలు, దోసె, ఇడ్లీ, ఉప్మా, మినుములు, సజ్జ వంటి పదార్థాలతో తయారు చేసిన ఆహారం విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హరే కృష్ణ మూవ్‌మెంట్ మరియు మన ట్రస్ట్ వంటి సంస్థలు ఈ ఆహారం తయారీలో సహకరిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సుమారు రూ.720 కోట్లు కేటాయించింది.

డ్రాపౌట్ రేటును తగ్గించడం, హాజరును పెంచడం కోసం ప్రభుత్వ నిర్ణయం

ఇది విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించడం, హాజరును పెంచడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దూరం నుంచి వచ్చే విద్యార్థులకు మంచి పోషకాహారం అందించడం లక్ష్యంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగంలో తీసుకుంటున్న ఈ చర్యలు తల్లిదండ్రుల్లో భరోసా కలిగిస్తుంది. పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు కొత్త యూనిఫాంలు, కిట్లు ఇస్తున్న క్రమంలో విద్యార్థులలో సంతోషం వెల్లి విరిసింది.

విద్యార్థులకు భారీ శుభవార్త.. తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్ కు సైతం బ్రాండెడ్ కిట్స్!
విద్యార్థులకు భారీ శుభవార్త.. తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్ కు సైతం బ్రాండెడ్ కిట్స్!

విద్యార్థుల అవసరాలను తీర్చేలా అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలు

ప్రభుత్వ స్కూల్స్ ఉపాధ్యాయులు కూడా ఈ సందర్భంగా విద్యార్థులను ఆహ్వానించి, కొత్త విద్యా సంవత్సరాన్ని స్ఫూర్తితో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలు పోషకాహార లోపం లేకుండా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా చదువుకునే వాతావరణం ఏర్పడింది.ఈ అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన పథకాలు విద్యార్థుల అవసరాలను తీరుస్తాయని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో చేపడుతున్న ఈ సంస్కరణలు రాష్ట్రాన్ని విద్యా హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+