Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దసరా, దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లనూ పొడిగిస్తూ వస్తోన్నారు.

SCR to run 22 festival special trains from Charlapalli and Sasaram

ఈ క్రమంలో తాజాగా మరో 22 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి నుంచి బిహార్ లోని ససారం వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇప్పటికే ఆరంభమైంది. ఈ నెల 11వ తేదీన తొలి రైలు పట్టాలెక్కనుంచి రెండున్నర నెలల పాటు అంటే నవంబర్ 21వ తేదీ వరకు ఆయా రైళ్లన్నీ కూడా చర్లపల్లి నుంచి ససారం వరకు అందుబాటులో ఉంటాయి.

  • ఈ నెల 11వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07021 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 8:30 నిమిషాలకు ససారం చేరుకుంటుంది.
  • ఈ నెల 12వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు ప్రతి శుక్రవారం రాత్రి 8:50 నిమిషాలకు ససారం నుంచి బయలుదేరే నంబర్ 07022 ప్రత్యేక రైలు రెండో రోజు ఉదయం 9:30 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
  • జనగాం, ఖాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సి, పిపరియా, మదన్ మహల్, కట్ని, సత్నా, మణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకి, దీన్ దయాల్ ఉపాధ్యాయ, భాబువా రోడ్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఆయా స్టేషన్లల్లో వాటికి హాల్ట్ సౌకర్యం ఉంది. 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+