Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక యథావిధిగా, ముహూర్తం ఫిక్స్- కొత్త లుక్కు, కీలక మార్పులు..!!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన బిగ్ అప్డేట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో కొన్ని రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి మళ్లించారు. ఏయిర్ పోర్ట్ తరహాలో స్టేషన్ ను తీర్చి దిద్దారు. ప్రయాణీకుల కోసం ఆధునిక సదుపాయాలు కల్పించారు. ఫేజ్ -1 పనులు దాదాపు తుది దశ కు చేరుకున్నాయి. దీంతో, ప్రయాణీకులకు అనుమతి పైన రైల్వే శాఖ తాజాగా ముహూర్తం ఖరారు చేసింది. దీంతో, ఇక త్వరలోనే యథావిధిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆపరేషన్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోయాయి. పూర్తిగా ఆధునీకరణతో ఏయిర్ పోర్టు తరహాలో దర్శనమిస్తోంది. ఎస్కలేటర్లు, ఎలివేటర్లతో నేరు ఒకటో అంతస్తులోకి ప్రవేశం.. పైన వెయింటింగ్‌ హాళ్లు, దుకాణాలు.. వాటి కింద రైల్వే ప్లాట్‌ఫారాలతో ఆకట్టుకుంటోంది. , బస్‌స్టేషన్‌ నుంచి రైల్వేస్టేషన్‌లోకి రావడానికి.. రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా వాటికి చేరుకునేందుకు స్కై వాక్‌లు ఏర్పాటు చేసారు. గతంలో చూసిన స్టేషన్ .. ఇప్పుడున్న రూపుతో పోల్చుకోలేని విధంగా ఆధునీకరించారు.

secunderabad-station-modernisation-first-phase-works-completes-in-next-march-partial-operations-wil

అద్భుతంగా రూపు దిద్దుకుంటున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ త్వరలోనూ తిరిగి ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. ఆధునీకరణ పనుల్లో భాగంగా తొలిదశలో భాగంగా ప్లాట్‌ఫామ్‌-10 వైపు చేపట్టిన వర్కులు 90 శాతం వరకు పూర్తికావడంతో.. మార్చి నెలాఖరు కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. నాలుగు అంతస్తులతో 22,516 చ.మీ వైశాల్యంతో చేపట్టిన ఐకానిక్‌ స్టేషన్‌భవనం పనులు దాదాపు పూర్తయ్యాయి.

విమానాశ్రయం తరహాలో సదుపాయాలు

కాగా, ఇక స్టేషన్ లో దక్షిణం వైపు 14,972 చదరపు మీటర్ల విస్తీర్ణంతో మరో భవనం పూర్తి చేసారు. రూ.719కోట్లతో నిర్మిస్తున్న స్టేషన్‌ తొలిదశ భవనాలు ఇవి. రెండో దశలో మొదటి ప్లాట్‌ఫామ్‌ వైపు భవనాలు కూడా పూర్తయితే స్టేషన్‌ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. రెండో దశ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే విధంగా అధికారులు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు. కాగా.. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు నేరుగా మొదటి అంతస్తుకు వెళతారు. తర్వాత రైలు పట్టాలకు 21 మీటర్లపైన రెండు అంతస్తులతో ఏర్పాటు చేసిన కాన్కోర్స్‌కు చేరుకుంటారు. ఇందులో ఒక అంతస్తులో ప్రయాణికులు వేచిఉండేలా ఏర్పాటు చేసారు.

స్టేషన్‌లో 108 మీటర్ల నిడివితో ఒకటి, 120మీటర్ల నిడివితో మరో కాన్కోర్‌ను నిర్మించారు. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన రైలు స్టేషన్‌కు వచ్చే సమయంలో కావాల్సిన ప్లాట్‌ఫామ్‌ వద్దకు నేరుగా దిగి వెళ్లవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు సులువుగా సికింద్రాబాద్‌ ఈస్ట్‌, వెస్ట్‌ మెట్రో స్టేషన్లు, బస్‌ స్టేషన్‌ను చేరుకునేలా 9 మీటర్ల వెడల్పుతో స్కైవాక్‌ను నిర్మించారు. స్టేషన్‌ ప్రాంగణంలో మొత్తం 26 ఎలివేటర్లు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు, 4 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లను నిర్మించారు. దీంతో.. తిరిగి సికింద్రాబాద్ స్టేషన్ ఆపరేషన్స్ త్వరలోనే పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించేందుకు తుది కసరత్తు జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+