Naresh: అబ్బే అదంతా ఉత్తిదే.. షాకిచ్చిన నరేష్, పవిత్ర..
తన పెళ్లిపై నటుడు నరేష్ స్పందించారు.
సీనియర్ నటుడు నరేష్, పవిత్ర పెళ్లి అయినట్లు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరు పెళ్లి చేసుకున్న వీడియోను నరేష్ పోస్ట్ చేయడంతో పవిత్రతో నరేష్ పెళ్లి జరిగినట్లు అందరు భావించారు. నరేష్ వీడియోతో పాటు ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులు అంటూ రాసుకొచ్చారు. దీంతో వారిద్దరి పెళ్లి కొద్ది రోజుల క్రితం జరిగినట్లు అందరు భావించారు.
అయితే ఈ పెళ్లి రియల్ కాదని నరేష్ క్లారిటీ ఇచ్చారు. ఓ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయనను మీడియా ప్రతినిధులు మీరు పవిత్రను పెళ్లి చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు నరేష్ సమాధానం దేటేసే ప్రయత్నం చేశారు. అయినా వదలని విలేకరులు ప్రభాస్, సల్మాన్ ఖాన్‌ల పెళ్లి కంటే మీ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయిందని అడిగారు. దీంతో తన వివాహానికి సంబంధించి త్వరలోనే ప్రెస్ పెడతామని నరేష్ చెప్పారు.













Click it and Unblock the Notifications