Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ కొత్త సీఎస్‌గా ఐఏఎస్ అధికారి కే రామకృష్ణారావు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కే రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఏప్రిల్ 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి కార్యాలయంలో మార్పులు చేర్పులు చేపట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పరిపాలన ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. కొత్త సీఎస్ నియామకంపై గత కొంత కాలంగా ప్రభుతవం తీవ్ర కసరత్తులు చేస్తున్న విషయం తెలిసింతే. శాంతి కుమారిని కొనసాగించాలని అనుకున్నప్పటికీ.. చివరకు కొత్త సీఎస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Senior IAS officer K Ramakrishna Rao appointed as CS of Telangana government


సీనియరిటీ జాబితా ప్రకారం.. రామకృష్ణారావుతోపాటు ఆరుగురు అధికారులు రేసులో నిలిచారు. వారందరి పేర్లను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు రామాకృష్ణారావు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ని సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి పదవీ విరమణ అనంతరం రామకృష్ణారావును సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలను చేపట్టింది ప్రభుత్వం.

తెలంగాణలో బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు

గుడ్‌ గవర్నెన్స్‌ వైఎస్‌ ఛైర్మన్‌గా శశాంక్‌ గోయల్
ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ సీఈవోగా జయేశ్‌ రంజన్‌
పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌
ఫైనాన్స్ కమిషన్‌ మెంబర్ సెక్రటరీగా స్మితాసభర్వాల్‌
కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్‌
పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి
పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి( హెచ్‌ఎండీఏ పరిధి)- ఇలంబర్తి
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌
ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా కె. శశాంక
రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ సెక్రటరీ, సీఈవోగా నిఖిల
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సంగీత సత్యనారాయణ
దేవాదాయశాఖ డైరెక్టర్‌, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్‌. వెంకటరావు
జెన్‌కో సీఎండీగా ఎస్‌.హరీశ్‌.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+