ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్ట్: విశ్రాంత ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంటి కబ్జాకు యత్నం!
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్రాంత ఐఏఎస్ భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు నవీన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, భన్వర్ లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్. అయితే, ఇల్లు ఖాళీ చేయకుండా కబ్జాకు యత్నించారని పోలీసులకు భన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు.
అంతేగాక, నకిలీ డాక్యుమెంట్లతో తన ఇంటి కబ్జాకు యత్నించారని నవీన్ కుమార్‌పై భన్వర్ లాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా నవీన్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. భన్వర్ లాల్ ఫిర్యాదు నేపథ్యంలో నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.

2014లో జూబ్లీహిల్స్‌లోని నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేశాం. 2019లో అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత ఖాళీ చేయమన్నాం. రెంటల్ అగ్రిమెంట్ కు విరుద్ధంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. మా ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారు అని నవంబర్ 17న భన్వర్ లాల్ సతీమణి మనీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేసిన పోలీసులు ఓర్సు సాంబశివరావు(నవీన్ కుమార్ సోదరుడు), అతని భార్య రూపా డింపుల్‌ను డిసెంబర్ 22న అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ పరారీలో ఉండగా.. బుధవారం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఓ ఐపీఎస్ అధికారి మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంటినే కబ్జా చేసేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలావుండగా, ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్టును బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఖండించారు.
మరోవైపు, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు సహకరించానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిాపారు.












Click it and Unblock the Notifications