ఏడు పెళ్లిళ్లు..! భార్యలకు ఏడు చెరువుల నీళ్లు తాగించాడు..! ఏడో భార్య చేతిలో కుక్క చావు చచ్చాడు..!!

హైదరాబాద్ : నగరంలో ఓ మహిళ మహిసాసుర మర్థిని అవతారం ఎత్తింది. తెలగిస్తే ఆడది అబల కాదు శక్తి స్వరూపిణి అని నిరూపించింది. వేధింపులే కాకుండా సభ్యసమాజం సిగ్గు పడే పనులు చేయమని ఒత్తిడి తెస్తున్నందుకు ఆగ్రహంతో ఉగ్రరూపం దాల్చింది. భర్త అని కూడా కనికరం చూపకుండా ప్రాణాలు తోడేసింది. అత్యంత దారుణమైన ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన నలభై రెండేళ్ల షేక్ షాబుద్దీన్, దుండిగల్‌కు చెందిన ఖైరున్నీసా బేగంను 2011లో వివాహం చేసుకున్నారు.

దంపతులు గాజులరామారం డివిజన్ రావినారాయణరెడ్డి నగర్‌కు రెండు నెలల క్రితం వచ్చి నివాముంటున్నారు. షాబుద్దీన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. అప్పటికే షాబుద్దీన్‌కి ఆరుగురితో వివాహం జరిగింది. చిత్రహింసలు భరించలేక నలుగురు భార్యలు వదిలి వెళ్లిపోయారు. మరో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం. ఖైరున్నీసాను ఏడో భార్యగా చేసుకున్నాడు.

Seven Weddings..! many hurdles for his wives..! The seventh wife killed him like a dog..!!

ఖైరున్నీసాకు అప్పటికే విహహం కాగా మొదటి భర్తకు కలిగిన సంతానం దుండిగల్‌లోని తల్లి వద్ద ఉంటున్నారు. షాబుద్దీన్ నిత్యం మద్యం సేవించి భార్యను వేధిస్తుండే వాడు. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు.

ఈ వేధింపులు భరించలేక ఖైరున్నీసా మంగళవారం తెల్లవారు జామున ఇనుపరాడ్డుతో భర్త మెడపై కొట్టడంతో కింద పడ్డాడు. చున్నీతో గొంతుకు బిగించి హత్య చేసింది. వెంటనే ఖైరున్నీసా నేరుగా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+