Telangana: కాజీపేటలో యువకులు వీరంగం.. క్యాబ్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు..

కాజీపేటలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏడుగురు యువకులు వీరంగం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు యువకులు తాము పోలీస్ కుటుంబాలకు చెందిన వ్యక్తులమని చెప్పుకుంటూ వీరంగం చేశారు. తమని ఎవరు ఏమి చేయలేరని కాజీపేట బస్టాండ్ వద్ద ప్రైవేట్ కార్స్ అద్దాలు పగలగొట్టారు.

ఈ ఘటనలో రెండు కార్లకు సంబంధించిన అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే ఒక క్యాబ్ డ్రైవర్ కు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన డ్రైవర్ ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఏడుగురు యువకులు అందులో ఒక యువకుడు కాజీపేట బస్టాండ్ ప్రాంతంలో మూత్ర విసర్జన చేస్తుండటంతో అక్కడే ఉన్న ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ ఇక్కడ మూత్ర విసర్జన చేయకూడదన్నారు.

Seven youths smashed car windows in Kazipet

దీంతో సదరు యువకులు డ్రైవర్ పై దాడికి దిగారు. అక్కడే ఉన్న కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సిద్దిపేట కమిషనరేట్ కి చెందిన ఓ సీఐ కొడుకు అలాగే ఓ కానిస్టేబుల్ కుమారుడు ఉండడం గమనార్హం. తాము పోలీస్ కుటుంబాలకు చెందిన వ్యక్తులమని నానా హంగామా సృష్టించి దాడులకు దిగినట్లు క్యాబ్ డ్రైవర్ తెలిపారు.

వెంటనే క్యాబ్ డ్రైవర్స్ కాజీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా యువకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూడా గొడవ పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా.. పోలీస్ ఫ్యామిలీ అని వదిలేస్తారా అని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+