మైనర్ బాలికపై 8మంది అత్యాచారం.. ఈ దారుణం అత్యంత అమానవీయం!

శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లోనూ చిన్నారులపై హింస మాత్రం ఆగడం లేదు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని పిల్లలను కూడా చిదిమేస్తున్న మృగాళ్లు సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. తాజాగా హైదరాబాద్లో అటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని మచ్చ బొల్లారంకి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న పదహారేళ్ల బాలిక పైన జరిగిన దారుణం పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థమయ్యేలా చెబుతుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక పదవ తరగతి చదివే సమయంలో జెర్రీ వరుణ్ అనే ఒక యువకుడు పరిచయమయ్యాడు. కొన్ని నెలల క్రితం అతను ఆ అమ్మాయికి చాక్లెట్లో మత్తుమందు కలిపి తన కారులో తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Sexual assault Eight individuals raped a 16-year-old Intermediate student from Macha Bollarum Hyd

ఆ తర్వాత జెర్రీ వరుణ్ ద్వారా పరిచయమైన రొమల వరుణ్ బాలికకు మద్యం, సిగరెట్లు, గంజాయి అలవాటు చేసి కొంపల్లి లో లైంగిక దాడి చేశాడు. అంతకుముందే డేవిడ్ వరుణ్ అనే మరో వ్యక్తి instagram ద్వారా పరిచయమై అమ్మాయిని కలిసి మద్యం తాగించి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు.కుమార్తె ప్రవర్తన పైన అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఈనెల 9వ తేదీన కుమార్తెను మందలించడంతో బాలిక ఇల్లు వదిలి బొల్లారం రైల్వే స్టేషన్ కు చేరుకుంది.

అక్కడ నీరజ్ అనే వ్యక్తి పరిచయమై మరో స్నేహితుడైన విక్కీ ని పిలిపించుకొని ఇద్దరు బాధితురాలిని తీసుకువెళ్లి మత్తులో దించి ఆ తర్వాత వేరువేరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత విక్కీ తన మిత్రుడు నిఖిల్ తో కలిసి అమ్మాయిని దూలపల్లి కి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరితో కలిసి ఓయో రూమ్ తీసుకుని బాలికపై లైంగిక దాడి చేశారు ఆ తర్వాత విక్కి బాధితురాలిని బొల్లారంలోని తన ఇంటికి తీసుకొచ్చి 9వ తేదీ రాత్రి బంధించారు.

తప్పించుకున్న బాలిక పదవ తేదీన బొల్లారం రైల్వే స్టేషన్ కు చేరుకోగా విక్కీ తన స్నేహితుడైన గణేష్ తో కలిసి అడ్డుకొని బాధితురాలిని బలవంతంగా మద్యం తాగించి మళ్లీ మేడ్చల్ రైల్వే స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ రైల్లో అత్యాచారం చేసి మల్కాజ్ గిరికి చేరుకున్నారు. మళ్లీ దూల్ పేట్ వైపు ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకుంది.

మాజీమంత్రి కొండా సురేఖ సంచలనవ్యాఖ్యలు.. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వారికి హెచ్చరిక!
మాజీమంత్రి కొండా సురేఖ సంచలనవ్యాఖ్యలు.. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వారికి హెచ్చరిక!

జరిగింది తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది పైన అల్వాల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+