హైదరాబాదులో మరింత సంతోషం, నేను అర్హుడినో కాదో తెలియదు: షారుక్ ఖాన్
తాను ఈ డాక్టరేట్‌కు అర్హుడినో కాదో తనకు తెలియదని, తన తల్లి పుట్టిన హైదరాబాదులో దీనిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ సోమవారం అన్నారు.
హైదరాబాద్: తాను ఈ డాక్టరేట్‌కు అర్హుడినో కాదో తనకు తెలియదని, తన తల్లి పుట్టిన హైదరాబాదులో దీనిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ సోమవారం అన్నారు.
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఆయనకు సోమవారం నాడు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఉర్దూ వర్శిటీ ఆరో స్నాతకోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌కు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ జాఫర్ యూనస్ సరేశ్ వాలా డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడారు. తనకు డాక్టరేట్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్య, ఉర్దూ భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తన తల్లి హైదరాబాద్‌లో జన్మించిందన్నారు. తన తండ్రి ఉర్దూ పండితుడన్నారు.
ఎదుటివారికి ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దని, జీవితంలో ముందుకెళ్లేటప్పుడు ఒక్కోసారి తల వంచాల్సి వస్తుందని, టైప్ రైటర్‌లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడం కష్టమని, అందుకే టైప్ చేసే సమయంలో ఆలోచించి జాగ్రత్తగా టైప్ చేయాలని, అదేవిధంగా జీవితంలో ఏం చేసినా ఆలోచించి జాగ్రత్తగా చేయాలన్నారు. ఏదైనా తప్పు చేశాక సరిదిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదన్నారు.
తన తల్లి పుట్టిన హైదరాబాదులో డాక్టరేట్ అందుకోవడం మరింత ఆనందమని, తన తల్లిదండ్రులు ఉంటే ఎంతో సంతోషించేవారని షారుక్ ఖాన్ అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications