ఈటల రాజేందర్ విజయం వెనక ఉంది అతడు.! ఎవరతను.?
హైదరాబాద్ : రాజకీయ చదరంగంలో గెలుపోటములకు అనేక కారణాలు దోహదం చేస్తుంటాయి. అన్ని అంశాలు ప్రభావవంతంగా కనిపిస్తున్నా ఏ అంశానికి ప్రధాన్యత ఇవ్వాలో జడ్జ్ మెంట్ తెలియక చాలా వరకు అపజయాల పాలవుతుంటారు రాజకీయ నేతలు. వంద మంది నిపుణులతో కష్టపడి పనిచేయించినా దక్కని విజయం ఒక్క సమర్ధవంతమైన ఉద్యోగితో సాద్యపడుతుంది. దాన్నే వ్యవహారాన్ని అంచనా వేసే సెల్ఫ్ జడ్జిమెంట్ అంటారు మానసిక నిపుణులు.

ఈటల తో ఉద్యమ సమయం నుండి అనుబంధం.. అందుకే పీఆర్వో ఉద్యోగం..
ఒక ఉద్యోగి అద్బుతంగా పనిచేసి సంస్థ అభివృద్దిలో కీలక అస్సెట్ అయితే ఎంపిక చేసిన వాడి జడ్జ్ మెంట్ వందకు వంద శాతం కరెక్ట్ అవుతుంది. అదే ఉద్యోగి విధులు సక్రమంగా నిర్వహించకుండా సంస్థ నష్టాలకు కారణం ఐతే అది ఆ ఉద్యోగిని ఎంపిక చేసిన వాడి జడ్జ్ మెంట్ లో లోపం ఉన్నట్టు తేలిపోతుంది. ఈటల రాజేందర్ ఉత్కంఠ పరిస్థితుల మధ్య హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారంటే అది తాను ఎంపిక చేసుకున్న వ్యక్తిగత ఉద్యోగి నిర్వహించిన బాద్యతల ప్రభావం కూడా ఉందనే టాక్ నడుస్తోంది.

జర్నలిజం టు పీఆర్వో.. వృత్తిలో చిన్న పొరపాటుకు కూడా అస్కారం ఇవ్వని చైతన్య
ఈటల రాజేందర్ దగ్గర దాదాపు ఏడు సంవత్సరాలుగా ప్రజా సంబంధాల అధికారిగా కొనసాగుతున్న చైతన్య ఈటల విజయంలో తెర వెనక కీలక పాత్ర పోషించారనే చర్చ జరుగుతోంది. సమయానికి మీడియా సమావేశాలు నిర్వహించడం, మీడియా సమావేశాలకు సంబంధించి సమాచారాన్ని మీడియా సంస్ధలకు చేరవేయడం, ఈటల మాట్లాడిన అంశాల్లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ధారించడం, ఈటల విలేఖరుల సమావేశం తర్వాత సమాచారాన్ని మీడియా సంస్ధలకు అందించడం, ప్రత్యక్ష ప్రసారాల ఆవశ్యకతలకు అనుగుణంగా లైవ్ సిగ్నల్స్ ను అందించడం వంటి అంశాల్లో చైతన్య చురుగ్గా వ్యవహరించినట్టు తెలుస్తోంది.

మంత్రి కన్నా ముందుండాలి.. పీఆర్వో వృత్తి ముమ్మాటికీ ఛాలెంజింగ్ జాబ్
ఎక్కడికి వెళ్లినా, ఏ కార్యక్రమంలో పాల్గొనాలన్నా ఈటల కన్నా గంట ముందునుండి క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. గత ఏడు సంవత్సారాలుగా చైతన్య తన విధులను సమర్ధవంతంగా నిర్వహించడమే కాకుండా హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా తెర వెనక కీలక చక్రం తిప్పి ఈటల రాజేందర్ గెలుపుకు ప్రధాన కారకుడయ్యడనే చర్చ జరుగుతోంది. మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర చేస్తున్న పీఆర్వో వ్యవస్ధకే చైతన్య వన్నె తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉద్యోగం పట్ల అంకిత భావం.. వృత్తికే వన్నె తెచ్చిన చైతన్య
మంత్రి దగ్గరో, ఎమ్మెల్యే దగ్గరో పీఆర్వో ఉద్యోగం లభిస్తే చాలు పైరవీలు చేసుకుని అంతో ఇంతో కూడబెట్టుకుందాం అనుకునే ఈ రోజుల్లో చైతన్య తన విధులను ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేయలేదని తెలుస్తోంది. ఈటల ఆర్ధిక మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఎంతో నిబద్దతగా కర్తవ్యం నిర్వహించాడు తప్ప ఏ నాడు అధికార దర్పాన్ని చూపించలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడలేనే క్లీన్ చర్చ జరుగుతోంది. అంతే కాకుండా చైతన్య నేటి పీఆర్వో వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తారని కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం వెనక ఉన్న అజ్ఞాత వాసి వ్యక్తి కూడా చైతన్య అనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications