వణికిస్తున్న చలి పులి.. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు... అలెర్ట్!

తెలంగాణా రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. రాష్ట్రంలో చలి కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉదయం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సింగల్ డిజిట్ కు చేరుకోవడంతో విపరీతంగా పెరిగిన చలితో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు.

రాష్ట్రంలో బాగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఒక్కసారి చలి పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అత్యల్పంగా తిర్యాని మండలం గిన్నెదరి, సిర్పూర్(యు) లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తిర్యాని లో 7.9 డిగ్రీల, కెరమెరి లో 9.3 డిగ్రీలు, దనోరా 9.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయింది.

Shivering cold waves in telangana Single digit temperatures in so many districts Alert

రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చలి విజృంభిస్తుంది. మెదక్ జిల్లా టేక్మాల్ లో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత, నర్సాపూర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా సంగారెడ్డి కోహిర్ లో లో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, జిల్లాలోని న్యాల్ కల్ 7.7, ఆల్గోల్ 7.6, కోహిర్ 6.9 సెంటిగ్రేడ్ ల ఉష్ణోగ్రత నమోదయింది..

జాతీయ రహదారులపై పొగమంచుతో వాహనాదారుల ఇబ్బంది
చలి తీవ్రతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచు కురుస్తుంది. దీంతో జాతీయ రహదారులు-65,121 రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . దట్టమైన పొగమంచుతో ప్రయాణాలు చేసేవారు భయపడుతున్నారు. ఇక సాయంత్రం 5 గంటల నుండే చలి గాలులు మొదలవుతున్నాయి. వాతావరణ నిపుణులు రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
ఇక చలి తీవ్రత నేపధ్యంలో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిళ్ళు, తెల్లవారు జామున ప్రయాణాలు మానుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అని చెప్తున్నారు. చలి వేళ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా సలహా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+