MLC Kavitha: కష్టాల సుడిగుండంలో కవిత.. అప్పటివరకు తీహార్ జైల్లోనే!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరిట లభించే అవకాశం లేకుండా పోయింది. షాకుల మీద షాకులు వరుస షాకులతో తీహార్ జైల్లోనే కెసిఆర్ తనయ కవిత విలవిలలాడుతోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన కవితకు మరో మారు ఊహించని షాక్ తగిలింది.

కవిత కస్టడీ మళ్ళీ పొడిగింపు
కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూకోర్టు మరో మారు పొడిగించింది. కవిత కస్టడీని జులై 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహారు జైలు నుంచి విచారణకు హాజరైన కవిత కు, ఈడీ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీని పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.

Shock again to MLC Kavitha Judicial Remand extension again in delhi liquor scam case

పీకల్లోతు కష్టాల్లో కవిత
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15వతేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో సిబీఐ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కవిత పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఓవైపు ఈడి మరోవైపు సిబిఐ కవితపై మూకుమ్మడిగా దాడి చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తూ ఎప్పటికప్పుడు కవిత కేసులో కొత్త అంశాలతో చార్జి షీట్లను ఫైల్ చేస్తున్నారు.

కవితపై ఈడీ, సీబీఐ మూకుమ్మడి దాడి
దీంతో కవిత బయటకు రావడం కష్టంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల రూపాయల లంచం ఇచ్చారని, ఆ 100 కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారని ఈడీ ఛార్జ్ షీట్లలో పేర్కొంది. ఇక సిబిఐ కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి కవిత అంటూ ఛార్జ్ షీట్ లో కీలక విషయాలు వెల్లడించింది.

కవితకు మళ్ళీ షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు
దాదాపు నాలుగు నెలలుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కవితకు బెయిల్ దొరకకపోగా ఆమె కస్టడీని మళ్ళీ మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగిస్తూ పోతుంది. ఇక తాజాగా కూడా కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు కస్టడీని పొడిగించి షాక్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+