ఐటీ ఉద్యోగులకు షాక్; దిగ్గజ ఐటీ సంస్థల కీలకనిర్ణయం!!
ఐటి ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. అనిశ్చితి, ఆర్థిక వ్యయం కారణంగా పలు దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నాయి. ఇటీవల రెండు కంపెనీలు లే ఆఫ్ ను ప్రకటించడంతో ఉద్యోగులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. చాలా ఐటి కంపెనీలు తన ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఉద్యోగుల ప్రయోజనాలకు గండి కొడుతూ ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగుల పరిస్థితిని డోలాయమాన పరిస్థితికి తీసుకువచ్చాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చాలా ఐటి కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకాలను నిలిపి వేశాయి. కొత్త ఉద్యోగులను తీసుకోకపోవడంతో పాటు, ఇప్పటికే పనిచేస్తున్న చాలామంది ఫ్రెషర్లను ఐటీ సంస్థలు తొలగిస్తున్నాయి. అంతేకాదు వేతనాల పెంపును వాయిదా వేస్తూ, ఉన్న ఉద్యోగులకే పనిభారాన్ని పెంచుతున్నాయి. ఉద్యోగుల వార్షిక వేతనాలలో కోత విధించేందుకు కూడా ఐటీ సంస్థలు ప్లాన్ చేస్తున్న పరిస్థితి ఉంది. వేతనాల పెంపును కూడా వాయిదా వేశాయి.

మార్కెట్ పరిస్థితుల కారణంగా సచిన్ బన్సల్ నవీ సంస్థతోపాటు ఎడెక్ట్ స్టార్టప్ స్కిల్ లింక్ తమ ఉద్యోగుల్లో చాలామందిని ఇంటికి పంపించడానికి రెడీ అయ్యాయి . ఇప్పటికే నవీ కంపెనీలో పనిచేస్తున్న 150 నుండి 200 మంది ప్రొడక్షన్, అనలిటిక్స్ డిపార్ట్మెంట్ లోని ఉద్యోగులను నవీ సంస్థ తొలగించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎడెక్ట్ స్టార్టప్ స్కిల్ లింక్ కూడా తమ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించింది.
ఖర్చులు తగ్గించడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం కోసం ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఐటీ సంస్థల సదరు చర్యలతో ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కనిపిస్తుంది. ఇప్పటికే పని భారం పెరగడంతో పాటు వేతనాల పెంపును వాయిదా వేసి, వార్షిక వేతనంలో కూడా కోత విధించాలని ఐటీ సంస్థలు చూస్తున్న క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉద్యోగులలో కనిపిస్తుంది. రాలిపోతున్న ఉద్యోగాలతో, ఐటి ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications