Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్రీ పఫ్ లో పాము.. ఇంకా ఎన్ని చూడాలో..!

ఇటీవలి కాలంలో బయటి ఫుడ్ అంటేనే జనం పారిపోయే పరిస్థితి నెలకొంది. అత్యంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటున్నాయి. చిన్న పిల్లలు తినే చాక్లెట్స్ దగ్గర్నుంచి ప్రతి వస్తువులో కల్తీ జరుగుతోందని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్రీ పఫ్ లో పాము పిల్ల కనిపించిన దృశ్యం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో హోటళ్లలో లేదా ఫుడ్ స్టాల్స్ లో బొద్దింకలు, ఈగలు, దోమలు కనిపించేవి. కొన్నిసార్లు ఎలుకలు, బల్లులు కనిపించాయి. అయితే ఈ సారి ఏకంగా పాములే ప్రత్యక్షం అవుతున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్, చౌబేపూర్‌ లో ని ఓ హోటల్ లో పరోటాలో బల్లి పడిన ఘటన మరచిపోకముందే మరో ఘటనలో పనీర్ కర్రీలో మాంసం ముక్కలు వచ్చాయి. ఈ రెండు ఘటనలు మరువక ముందే మరో సంఘటన వెలుగు చూసింది. కర్రీ పఫ్ లో పాము కనిపించిన షాకింగ్ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది.

మహబూబ్ ​నగర్​ జిల్లా జడ్చర్ల పట్టణంలో షాకింగ్ ఘటన జరిగింది. సీఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణం, జౌఖీ నగర్ కు చెందిన శ్రీశైలం అనే వ్యక్తి.. తన పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. ఇంటికి వచ్చే క్రమంలో పిల్లలు ఎగ్ పఫ్ , కర్రీ పఫ్ అడగ్గా.. వారికి ఎగ్​ పఫ్, కర్రీపఫ్ కొన్నాడు. అయితే పిల్లలు ఇద్దరూ బేకరీలోనే పఫ్ తిన్నారు. భార్య కోసం కర్రీ పఫ్ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత మహిళ తినే ప్రయత్నం చేయగా అందులో పాము పిల్ల కనిపించడంతో షాక్ కు గురయ్యారు. దీంతో బాధితురాలు వెంటనే పోలీస్​ స్టేషన్​ ఫిర్యాదు చేశారు. సీఐ బేకరినీ సందర్శించి ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Shocking Find Snake in Curry Puff from Jadcharla Bakery Goes Viral

మరోవైపు తాజాగా హైదరాబాద్​ నగరంలోని పిస్తా హౌస్​ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తం 25 రెస్టారెంట్లను తనిఖీ చేయగా.. వంట గది శుభ్రంగా లేకపోవడంతోపాటు చెత్త బుట్టలకు మూతలు లేకపోవడం, రిఫ్రిజిరేటర్లు శుభ్రంగా లేకపోవడం, కలుషిత నీటిని వినియోగించడం తదితర సమస్యలను గుర్తించారు. దీంతో ప్రజలు బయట తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నిపుణులు తెలుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+