కాసేపట్లో పెళ్లి.. అక్క మొగుడితో పెళ్ళికూతురు జంప్; షాక్ లో కుటుంబం!!
జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతికి పెళ్లి చేయాలని నిర్ణయించిన తల్లిదండ్రులు,పెళ్లి డేట్ ఫిక్స్ చేసి, బంధువులందరికీ వివాహ ఆహ్వాన పత్రికలు పంచి, మేళతాళాలు, వేదమంత్రాలతో పెళ్లి చేయాలని భావిస్తే,ఆ యువతి తల్లిదండ్రులకు, సొంత అక్క కు ఇచ్చిన షాక్ స్థానికంగా ఉన్నవారిని,బంధువులందరినీ నివ్వెరపోయేలా చేసింది.ఇంతకీ కాసేపట్లో పెళ్లి అనగా ఆ యువతి ఏం చేసింది? అసలేం జరిగింది?
జగిత్యాల జిల్లా కన్నాపూర్ మండలానికి చెందిన యువతిని,లంబాడి పల్లికి అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు.ముహూర్తం ప్రకారం వీరిద్దరూ ఆదివారం జరిగే పెళ్లిలో ఒక్కటి కావలసి ఉంది. అయితే పెళ్లి మండపంలో పీటల పై కూర్చుని వరుడితో తాళి కట్టించుకోవలసిన వధువు మరికాసేపట్లో పెళ్లి అనగా కనిపించకుండా మాయమైంది.

వధువు ఎక్కడికి వెళ్లిందో అర్థంకాని బంధువులు ఆమె కోసం వెతుకుతుండగా, వధువు అక్క భర్త కూడా కనిపించకపోవడం అందరినీ నిర్ఘాంత పోయేలా చేసింది.పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్లింది? పెళ్లి కూతురి అక్క భర్త అంటే ఆమె బావ కూడా కనిపించకుండా ఎటు వెళ్ళాడు? అని ఆరా తీసిన వాళ్ళు బావ తో కలిసి పెళ్లి కూతురు జంప్ అయింది అని తెలిసి షాక్ కు గురయ్యారు.
ఇప్పటివరకు వాళ్ల కోసం వెతికితే ఎంతకూ ఆచూకీ లభించలేదు. ఇక పెళ్లి చేసుకుందామని ఆశ పడిన పెళ్ళికొడుకు యువతి ఇచ్చిన షాక్ కు లబోదిబోమంటున్నాడు. తనను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా అని తెగ బాధ పడుతున్నాడు. సొంత చెల్లెలే తన భర్తను తీసుకొని వెళ్లి పోవడాన్ని ఆ అక్క జీర్ణించుకోలేకపోతోంది. తన భర్త తో పాటు, తన చెల్లెలు చేసిన పనికి లబోదిబోమంటున్నది.

ఇక పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు చిన్న కుమార్తె బావను తీసుకొని వెళ్ళిపోవడం తో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇద్దరు కూతుళ్ళ జీవితం ఎలా అని బాధ పడుతున్నారు. సమాజంలో రోజురోజుకీ మానవ సంబంధాలు మృగ్యమై పోతున్నాయని, బంధాలకు, అనుబంధాలకు అర్థం లేకుండా పోతుందని, వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకు పెరిగి పోతున్నారని చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.












Click it and Unblock the Notifications