షాకింగ్: బడిలో గుడి కట్టాలని నాగదేవత ఆదేశం.. వారికి హెచ్చరిక!!

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల వరుస పాముకాటులతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విద్యార్థులు వరుసగా పాముకాట్లకు గురికావడంతో పాటు అస్వస్థతకు గురికావడంపైన పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపణలు చేయడంతో పాఠశాల ప్రిన్సిపల్ కే విద్యాసాగర్ ను సస్పెండ్ చేశారు.

పదిరోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి
జులై 27వ తేదీన పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న అనిరుద్ అనే విద్యార్థి పాముకాటుకు గురై మరణించాడు. ఇక ఆ సంఘటన మర్చిపోకముందే గత శుక్రవారం ఉదయం మోక్షిత్, హేమంత్ యాదవ్ అనే ఇద్దరు విద్యార్థులు కూడా పాము కాటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హేమంత్ యాదవ్ మృతి చెందగా, మోక్షిత్ కు చికిత్స కొనసాగుతుంది. పదిరోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందారు.

shocking nagadevatha ordered to build a temple in the peddapur gurukul school gave warning

నిలకడగా పాము కరిచిన మరో బాలుడి ఆరోగ్యం
అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలుడికి ఫుడ్ పాయిజన్ కు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో పాము కాటుకు గురై ఉండవచ్చునని యాంటీ వెనం ఇంజక్షన్ ఇచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే తాజాగా పాఠశాల ప్రాంగణంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

మహిళకు పూనకం.. బడిలో గుడి కట్టాలని ఆదేశం ..
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఈరోజు ఓ మహిళకు పూనకం వచ్చింది. పూనకంతో ఊగిపోయిన మహిళా తాను నాగదేవతనని, ఈ పాఠశాలలో తనకు తావు దొరకక తిరుగుతున్నానని తనకు ఈ పాఠశాలలో వెంటనే గుడి కట్టించాలని పేర్కొంది. లేకపోతే ఇలానే విద్యార్థులు పాముకాట్లకు గురవుతారని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వరుస మరణాలతో ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

మహిళ చెప్పిన విషయాలతో తల్లిదండ్రులలో ఆందోళన
మహిళ ఆ పాఠశాలలో గుడి కట్టకపోతే మరిన్ని పాముకాటు సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పడంతో భయపడుతున్నారు. పెద్దాపూర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పూనకం వచ్చిన మహిళ చెప్పిన మేరకు గుడిని కడతారా? ఒకవేళ కట్టకుంటే తమ పిల్లలు పాము కాటు బారిన పడే ప్రమాదం ఉంటుందా అని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+