షాకింగ్ : రెమిడెసివిర్ డూప్లికేట్, బ్లాక్ మార్కెట్ : ఖాళీ సీసాలో సెలైన్ లిక్విడ్, ప్రాణాలతో దందా!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా సోకిన బాధితులకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు అనివార్యంగా మారాయి. మార్కెట్లో వీటికి కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బ్లాక్ లో దందా చేస్తూ, డూప్లికేట్ ఇంజక్షన్ లను తయారు చేస్తూ కరోనా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. కాదేది కల్తీకి అనర్హం, దోపిడీకి అనర్హం అని భావించిన వారు ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు.

ఖాళీ రెమిడెసివిర్ బాటిల్ లో సెలైన్ వాటర్ నింపి విక్రయిస్తున్న గ్యాంగ్

ఖాళీ రెమిడెసివిర్ బాటిల్ లో సెలైన్ వాటర్ నింపి విక్రయిస్తున్న గ్యాంగ్


నిజామాబాద్ జిల్లాలో ఖాళీ రెమిడెసివిర్ బాటిల్ లో సెలైన్ వాటర్ నింపి అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్న దందా వెలుగు చూసింది. కరోనా మహమ్మారి బారిన పడిన వారికి ఇచ్చే ట్రీట్మెంట్ లో భాగంగా రెమిడెసివిర్ ఇంజక్షన్ లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో బ్లాక్ మార్కెట్ కు తెరతీశారు కొందరు అక్రమార్కులు. ఆర్మూర్ కు చెందిన ఒక ప్రైవేట్ డాక్టర్, నిజామాబాద్ లోని మరో ప్రైవేటు ఆసుపత్రి కాంపౌండర్ లను ఈ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బయోవేస్ట్ రెమిడెసివిర్ ఇంజక్షన్ బాటిల్స్ ను సేకరించి వాటిలో సెలైన్ లిక్విడ్ ఎక్కించి 30 వేల రూపాయల చొప్పున ఒక్కో ఇంజక్షన్ ను విక్రయించినట్లుగా గుర్తించారు.

నిజామాబాద్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగానూ సాగుతున్న బ్లాక్ దందా

నిజామాబాద్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగానూ సాగుతున్న బ్లాక్ దందా


తమ వారి ప్రాణాలు కాపాడుకోవడానికి, కరోనా రోగుల తరపు బంధువులు పడుతున్నఆరాటాన్ని గుర్తించి రెమిడెసివిర్ ఇంజక్షన్లు తమ వద్ద ఉన్నాయని చెప్పి మోసం చేసి, సెలైన్ లిక్విడ్ నింపిన బాటిల్స్ ను విక్రయించారు ఈ ప్రబుద్ధులు. ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా కూడా రెమిడెసివిర్ దందా అడ్డగోలుగా సాగుతుంది. ఓ అవుట్ సోర్సింగ్ నర్స్, తన భర్త ద్వారా రెమిడెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తుండగా 4 వ టౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

 ఒకేరోజు మూడు వేర్వేరు ఘటనలు .. కేసులు నమోదు చేసిన పోలీసులు

ఒకేరోజు మూడు వేర్వేరు ఘటనలు .. కేసులు నమోదు చేసిన పోలీసులు

నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు మూడు చోట్ల మూడు వేర్వేరు ఘటనలలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్న అక్రమార్కులను పట్టుకున్నారు పోలీసులు. వీరిపై కేసులు సైతం నమోదు చేశారు.
వాడి పారేసిన రెమిడెసివిర్ ఇంజక్షన్ బాటిల్ లో సెలైన్ లిక్విడ్ నింపి అమ్మకాలు జరుపుతున్న వారు ఒకరైతే, ప్రభుత్వ ఆసుపత్రి నుండి పేషంట్స్ కు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తున్న వారుమరొకరు, ఇక ప్రైవేటు ఆసుపత్రుల నుండి బ్లాక్ మార్కెట్ చేస్తూ మరొకరు పోలీసులకు పట్టుబడ్డారు.

నకిలీ వైద్యుల కరోనా దందాపై మండిపడుతున్న ఐఎంఏ

నకిలీ వైద్యుల కరోనా దందాపై మండిపడుతున్న ఐఎంఏ

ఇదిలా ఉంటే నిజామాబాద్ జిల్లాలో కొందరు ప్రైవేటు వైద్యుల తీరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం కొందరు వైద్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. కొందరు నకిలీ వైద్యులు నిజామాబాద్ నగరంలో ఐఎంఏకు సంబంధం లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారని, కరోనా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇలాంటి నకిలీ వైద్యులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. తమకు ఈ నకిలీ వైద్యులు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతోంది.

కోవిడ్ ఆస్పత్రుల్లో ఇంతా జరుగుతున్నా చోద్యం చూస్తున్న సర్కార్

కోవిడ్ ఆస్పత్రుల్లో ఇంతా జరుగుతున్నా చోద్యం చూస్తున్న సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో ఒక నిజామాబాద్ జిల్లాలోని పరిస్థితి ఇలా ఉందంటే, మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ జరుగుతున్నా, ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా దోచుకుంటున్నా, కరోనా రోగుల ప్రాణాలు నిలువునా తీస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది తెలంగాణ సర్కార్. బ్లాక్ మార్కెట్ కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న సర్కార్ ఒకసారి కోవిడ్ ఆస్పత్రుల పేరుతో జరుగుతున్న దందాపై దృష్టి సారించాలని,సామాన్యులకు వైద్యాన్ని అందేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+