Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rajiv Yuva Vikasam:"రాజీవ్ యువ వికాసం" స్కీంను దరఖాస్తు చేసుకోండిలా..!

Rajiv Yuva Vikasam:తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు "రాజీవ్ యువ వికాసం" పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీంలో భాగంగా యువతకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కోసం రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 17 వ తేదీని ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం అర్హులను ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది. దీనిలో 60 శాతం నుంచి 80 శాతం వరకు సబ్సిడీని కూడా ప్రభుత్వం అందిస్తోంది. మరి ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. దాని కోసం ఏం పత్రాలు కావాలి.. ఎక్కడ చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ పథకాన్ని https://tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ వర్గాల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పథకానికి రేషన్ కార్డులు కలిగిన వారు అర్హులుగా ఉన్నారు. ఆధార్ నంబర్ రేషన్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి. ఆధార్ కార్డు, ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం తమ పేరును నమోదు చేసుకోవాలి. కీలక విషయం ఏమిటంటే.. రేషన్ కార్డులోని సభ్యులలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది.

Simple Steps to Apply for Rajiv Yuva Vikasam Scheme in Telangana

దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు ఇవే..
1.ఆధార్ కార్డు
2.కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
3.పాన్ కార్డు
4.పాస్‌పోర్టు సైజు ఫోటో
5. లబ్ధిదారుడి ఫోన్ నంబర్

ఈ పథకం కోసం కీలక తేదీలు ఇవే..
దరఖాస్తు ప్రారంభమైన తేదీ: మార్చి 17
దరఖాస్తుకు గడువు: ఏప్రిల్ 5
ఎంపిక ధ్రువీకరణ : ఏప్రిల్ 6 నుంచి మే 31
తుది లబ్ధిదారుల జాబితా ప్రకటన : జూన్ 2

దరఖాస్తు ప్రక్రియ ఇలా..
1. తొలుత అధికారిక పోర్టల్ https://tgobmms.cgg.gov.in/ కు వెళ్లాలి.

2. హోంపేజీలో ఉన్న "రాజీవ్ యువ వికాసం" లింక్ పై క్లిక్ చేయాలి.

3. "రాజీవ్ యువ వికాసం" దరఖాస్తు ఫారంపై క్లిక్ చేయాలి.

4. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. అన్ని ఫీల్డ్ లను పూరించి రిజిస్టర్ చేసుకోవాలి.

5. ఆ తర్వాత దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో వ్యక్తగత, వృతి, విద్య వివరాలను నమోదు చేయాలి.

6. ఆధార్, ఫుడ్ సెక్యూరిటీ కార్డు(రేషన్ కార్డు) నంబర్లు ఎంటర్ చేయాలి. అనంతరం సెక్టార్ ను ఎంపిక చేసుకోవాలి.

7. వివరాలను సమర్పించిన అనంతరం గో బటన్ ను నొక్కాలి.
8. అనంతరం రెండో దశలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల వివరాలను ఎంటర్ చేయాలి

9. ఇంటి నంబర్, అడ్రస్ నమోదు చేసుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ చేసిన అనంతరం ప్రివ్యూ చూశాక.. అన్ని సరిగ్గా ఉంటేనే సబ్మిట్ బటన్ నొక్కాలి.

10. తప్పనిసరి అని ఉన్న అన్ని వివరాలను నమోదు చేయాలి. యూనిట్ కాస్ట్ విలువ రూ.4 లక్షలకు మించకుండా ఉండాలి.

11. ఏప్రిల్ 5 గడువుకు ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

లబ్ధిదారులను 3 కేటగిరీలుగా విభజన

రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులను యూనిట్ల విలువ ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీ ప్రకారం రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. అందులో 80 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. రెండో కేటగిరీ రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు రుణాలను అందజేయనుండగా.. అందులో 70 శాతం వరకు రాయితీని కల్పిస్తారు. మూడో కేటగిరీ కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలను మంజూరు చేస్తారు. అందులో 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. చివరకు గరిష్టంగా రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తారు.

ఉపాధి అంశాలు ఇవే..

వ్యవసాయ అంశాలు
1.ఎద్దుల బండ్లు
2.ఆయిల్ ఇంజిన్
3.పంప్ సెట్
4.ఎయిర్ కంప్రెషర్
5.పత్తి సేకరణ యంత్రం
6.వేరుశనగ మిషన్
7.వర్మీ కంపోస్ట్
8.ఆయిల్ ఫామ్ పంట

పశుపోషణ
1. గేదెలు
2. ఆవులు
3. డైరీ ఫారం
4. కోడిగుడ్ల వ్యాపారం
5. చేపల వ్యాపారం
6. మేకల పెంపకం
7. పాల వ్యాపారం
8. పౌల్ట్రీ ఫారం
9. గొర్రెల పెంపకం

సొంత వ్యాపారం

1. ఎయిర్ కూలర్ల వ్యాపారం
2. స్టీల్ సామాన్ల వ్యాపారం
3. ఆటోమొబైల్ షాపు
4. బేకరీ షాపు
5. గాజుల దుకాణం
6. హెయిర్ కటింగ్ షాపు
7. బుట్టల తయారీ షాపు
8. బ్యూటీ పార్లర్ షాపు
9. జనరల్ స్టోర్
10. ఇటుకలు తయారీ వ్యాపారం
11. డిష్ టీవీ ల ఏర్పాటు
12. వడ్రంగి షాపు
13. సీసీ కెమెరాల రిపేర్ షాప్
14. ఎలక్ట్రిక్ షాపు
15. ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ కేంద్రం వైరింగ్ కేంద్రం
16. మగ్గం టైలరింగ్
17. చెప్పులు అమ్మే దుకాణం
18. పండ్ల వ్యాపార కేంద్రం
19. పండ్ల రసాల దుకాణం
20. బట్టల దుకాణం
21. కిరాణం జనరల్ స్టోర్
22. జనరేటర్ షాప్
23. గిఫ్ట్ ఆర్టికల్ షాప్
24. బంగారు నగల దుకాణం
25. పిండి గిర్ని కేంద్రం
26. హోటల్ ఏర్పాటు
27. ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు
28. ఐరన్ బిజినెస్
29. లేడీస్ కార్నర్
30. లాండ్రీ షాపు డ్రై క్లీనింగ్
31. పేపర్ ప్లేట్ల తయారీ
32. లైట్స్ డెకరేషన్ సౌండ్ సిస్టం
33. అగరబత్తుల తయారీ
34. మినీ సూపర్ బజార్
35. మెడికల్ అండ్ జనరల్ స్టోర్
36. ఆటో టిఫిన్ సెంటర్
37. మోటార్ మెకానిక్
38. మోటార్ అండ్ పైప్ లైన్
39. మటన్ షాపు
40. పాన్ షాపు
41. పేపర్ బ్యాగుల తయారీ
42. ఫోటో అండ్ వీడియో షాపు
43. పిండి గిర్ని
44. ఫిల్టర్ వాటర్ కేంద్రం
45. రెడీమేడ్ బట్టల దుకాణం
46. చీరల వ్యాపారం
47. స్లాబ్ కటింగ్ మిషన్
48. స్ప్రే పెయింటింగ్ మిషన్
49. స్టీల్ అండ్ సిమెంట్
50. స్టిచింగ్ మిషన్
51. సప్లయర్స్ షాపు
52. మిఠాయిల షాపు
53. టైలరింగ్
54. వెల్డింగ్ షాపు
55. వాటర్ సర్వీసింగ్ సెంటర్
56. కూరగాయల వ్యాపార షాపు
57. టిఫిన్ అండ్ టీ షాప్
58. టీవీ మెకానిక్ షాప్
59. సెల్ ఫోన్ రిపేర్ షాప్
60. సిమెంటు ఐరన్ షాపు
61. సెంట్రింగ్ పరికరాల షాపు
62. చెప్పుల తయారీ షాపు
63. చికెన్ సెంటర్
64. బట్టల వ్యాపారం
65. కాఫీ హోటల్
66. కాంక్రీట్ మిల్లర్స్ పరికరాలు
67. కూల్ డ్రింక్ షాప్
68. క్రేన్
69. కర్రీస్ పాయింట్
70. సైకిల్ మెకానిక్
71. వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు
72. డీజిల్ ఆటో
73. డిజిటల్ కెమెరా షాపు
74. సెటప్ బాక్స్ ల ఏర్పాటు
75. కూరగాయల దుకాణం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+