వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని సింగరేణి నిర్వాసితుల నిరసన: రామగిరి ఓపెన్ కాస్ట్ విస్తరణపై కొనసాగుతున్న ధర్నాలు!!

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్‌ గ్రామంలో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) ఓపెన్‌ కాస్ట్‌-2 బొగ్గు గని విస్తరణ ప్రాజెక్టు విషయంలో ఆందోళనలు ఆగడం లేదు. నెలరోజులుగా లద్నాపూర్ గ్రామస్తులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లద్నాపూర్ గ్రామంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గని 2 విస్తరణ ప్రాజెక్టులో భాగంగా అధికారుల "కూల్చివేతలకు నిరసనగా స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

లద్నాపూర్ భూ నిర్వాసితులకు, సింగరేణి అధికారులకు మధ్య నిత్యం గొడవ
సింగరేణి యొక్క రామగుండం III ఏరియాలోని లద్నాపూర్‌లో బొగ్గు గనుల విస్తరణ ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసినప్పటికీ, పునరావాసం, పునరావాస (R&R) ప్యాకేజీ ప్రయోజనాలను తమకు ఇవ్వకుండా తమను బలవంతంగా గ్రామాల నుండి ఖాళీ చేయిస్తున్నారని బాధిత భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న 283 మంది భూనిర్వాసితులకు, సింగరేణి అధికారులకు మధ్య గొడవ గత నెల రోజులుగా నిత్యం కొనసాగుతుంది.

సింగరేణి ఓపెన్ కాస్ట్ గని 2 వద్ద నిర్వాసితుల ధర్నా
పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఊరుకోబోమని వారు హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా మరోమారు పెద్ద ఎత్తున గ్రామస్తులు సింగరేణి ఓపెన్ కాస్ట్ గని 2 వద్ద ధర్నా చేపట్టారు. సింగరేణి ఉద్యోగులు బొగ్గుగనిలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాసితులు. ఇటీవల బొగ్గు గనిలోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అప్పుడు పోలీసులు వారిని అడ్డుకున్నారు.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్‌ గ్రామంలో సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) ఓపెన్‌ కాస్ట్‌-2 బొగ్గు గని విస్తరణ ప్రాజెక్టు విషయంలో ఆందోళనలు ఆగడం లేదు. నెలరోజులుగా లద్నాపూర్ గ్రామస్తులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లద్నాపూర్ గ్రామంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గని 2 విస్తరణ ప్రాజెక్టులో భాగంగా అధికారుల కూల్చివేతలకు నిరసనగా స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

సింగరేణి నిర్వాసితుల డిమాండ్లు ఇవే
నిర్వాసిత కుటుంబాలలో 18 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ, ఇళ్ళ స్థలం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించే వరకు ఆందోళన చేస్తామని, ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు సింగరేణి నిర్వాసితులకు అండగా రాజకీయ పార్టీల నేతలు నిలబడ్డారు. గ్రామస్తులకు ఇవ్వవలసిన పరిహారాన్ని తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సింగరేణి అధికారుల వెర్షన్ ఇలా... వివాదం పరిష్కారం అవుతుందా?
సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం చెల్లించాలని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఇక ఓపెన్ కాస్ట్ విస్తరణ పనులు శరవేగంగా చెయ్యాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సింగరేణి అధికారులకు, లద్నాపూర్ గ్రామస్తులకు మధ్య చోటుచేసుకున్న వివాదం ఎప్పటికి పరిష్కారం అవుతుందో వేచి చూడాల్సిందే.

English summary
Residents of ladnapur village Peddapalli district staged dharna again against the Singareni ownership at the Ramagiri open cast coal mine for their Rehabilitation package.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X