సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే!!
బుల్లితెరలో టీవీ షో లతో తన ప్రస్తానాన్ని ప్రారంభించి, ప్రస్తుతం తన గాత్రంతో వెండితెరలో వెలుగు వెలుగుతుంది మంగ్లీ. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు అనేక భాషలలో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారింది మంగ్లీ. సింగర్ గా ప్రయాణం ప్రారంభించిన తర్వాత అనతికాలంలోనే మంగ్లీ టాప్ మోస్ట్ సింగర్ గా మారారు.
వరుస హిట్ పాటలతో , తనదైన గాత్రంతో ప్రస్తుతం ఉన్న ప్రొఫెషనల్ సింగర్స్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. మంగ్లీ ఇటీవల కాలంలో పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి. దీంతో మంగ్లీ కి డిమాండ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విపరీతంగా కనిపిస్తుంది. మంగ్లీ ఏ పాట పాడిన ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతున్నారు. ఆమె పాడింది ఐటమ్ సాంగ్ అయినా ఫోక్ సాంగ్ అయినా హిట్ కావాల్సిందే అన్నట్టు మారింది పరిస్థితి.

ఇక ప్రస్తుతం పాటల ప్రపంచంలో దూసుకుపోతున్న మంగ్లీకి తృటిలో ప్రమాదం తప్పింది.హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై తొండపల్లి వంతెన వద్ద మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక దినోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి వస్తున్న క్రమంలో డీసీఎం వారి వాహనాన్ని ఢీ కొట్టిందని సమాచారం.
మంగ్లీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో డీసీఎం కారును ఢీకొట్టడంతో మంగ్లీ కి ఆమెతో ప్రయాణించిన మేఘరాజ్, మనోహర్ లకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. మంగ్లీ కారును ఢీ కొట్టిన డీసీఎం వాహన డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు.
డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో మంగ్లీ కారు వెనుక భాగం బాగా దెబ్బతింది. ఏది ఏమైనా ప్రముఖ గాయని మంగ్లీ తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ వార్త తెలిసిన మంగ్లీ ఫ్యాన్స్ మొదట ఆందోళన చెందినా , ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications