లిక్కర్ పార్టీలో సింగర్ మంగ్లీ.. గంజాయితో అడ్డంగా దొరికిపోయిన బ్యాచ్..!
ముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు 50 మంది హాజరయ్యారు.
అయితే, ఈ పార్టీలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు త్రిపుర రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా, పార్టీలో ఉన్న 48 మందికి పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించగా, అందులో 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనపై పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications