Theaters: హైదరాబాద్ లో మూతపడనున్న థియేటర్లు.. ఎందుకంటే..!
హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేయనున్నారు. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా థియేటర్లను మూసివేయనున్నారు. మే 17 నుంచి రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నట్లు యజమానులు తెలిపారు. అయితే థియేటర్లు ఎందుకు మూసివేస్తున్నారని చాలా మందికి సందేహాలు వచ్చాయి. థియేటర్లు మూసివేయడానికి ప్రధాన కారణం పెద్ద సినిమాలు లేకపోవడమే.
సాధారణంగా ఎండకాలం సెలవులు వస్తాయి. సెలవులు వస్తాయి కాబట్టి చాలా సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఈసారి సమ్మర్ పెద్ద సినిమాలు రావడం లేదు. మరోవైపు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో చాలా సినిమాల విడుదల వాయిదా పడ్డాయి. ఈ సమ్మర్ లో చిన్న చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఎక్కువగా రాలేదు. సినిమాలు లేక థియేటర్లు నిండడం లేదు. సినిమాలు రీ రిలీజ్, చిన్న సినిమాలు వేస్తూ కాలం గడిపారు.

అయితే ఇది వర్కవుట్ కాకపోవడంతో థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. సినిమాలు నడిపించినా విద్యుత్ ఛార్జీలు, మెయింటెన్స్ ఖర్చులు కూడా రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో తాత్కాలికంగా థియేటర్లు నిర్ణయించారు యజమానలు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసి వేస్తుండగా.. మల్టిఫ్లెక్స్ ల్లో తెలుగు హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్ చిత్రాలను నడపనున్నారు.
ఇక్కడ గమనించాల్సి విషయం ఏమిటంట్.. కరోనా తర్వాత సినిమా థియేటర్లకు వెళ్లి మూవీ చూసే వారి సంఖ్య భారీగా తగ్గింది. ప్రజలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చిన తర్వాతే సినిమాలు చూస్తున్నారు. పైగా మల్టిప్లెక్స్ ల్లో టికెట్ల ధరలు భారీగా ఉండడంతో సినిమా చూసే వారి సంఖ్య తగ్గింది.












Click it and Unblock the Notifications