సిరివెన్నెల మృతి తీరని లోటు: తెలంగాణా సీఎం కేసీఆర్, సీఎం జగన్, చంద్రబాబు, చిరంజీవి, బాలకృష్ణ తదితరులు
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ జీవిత సత్యాన్ని బోధించిన మహనీయుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆది భిక్షువు వాడినేది కోరేది.... బూడిదిచ్చేవాడినేది అడిగేది అంటూ అర్థవంతమైన పాటలను రాసి, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అంటూ ప్రతి ఒక్కరిలో విప్లవ భావాలను స్పురింపజేసి పాటకు గౌరవం ఇచ్చిన మహనీయుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి. తాను చేసిన సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామ శాస్త్రి బ్రతికినంత కాలం విలువలతో బ్రతికారు.

సిరివెన్నెల మృతికి ప్రముఖుల సంతాపం
ఒక పాటను అర్థమయ్యేలా రాయాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవాలనే కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాటల స్థాయిని పెంచిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయన పదాలనే కిరణాలను తీసుకుని, అక్షరాలనే తూటాలను తీసుకొని ప్రపంచం మీద వేటాడటానికి బయలుదేరుతాడు. ఒక మనిషిని కలిగించే శక్తి సాహిత్యానికి ఉంటుందని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల. ప్రముఖ సినీ గేయ రచయిత తెలుగు సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినిమా ప్రపంచానికే కాదు యావత్ తెలుగు ప్రజలందరికీ తీరని ఆవేదన కలిగిస్తోంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటు : సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు ఎటువంటి సంగీత ప్రియులతో నైనా పెనవేసుకుపోయి అద్భుత సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి పండిత ,పామరుల మనసు గెలిచారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు చలన చిత్ర రంగానికి సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటని ఆయన అభిప్రాయపడ్డారు. వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విలువల శిఖరం సిరివెన్నెల : సీఎం జగన్
అంతేకాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అంటూ కొనియాడారు . సిరివెన్నెల మరణం తెలుగు వారికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు అంటూ పేర్కొని సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి.
సిరివెన్నెల మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు : చంద్రబాబు
ఇదిలా ఉంటే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిరివెన్నెల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు. అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్న చంద్రబాబు దాదాపు 3000లకు పైగా పాటలు రాసి సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామశాస్త్రి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
సిరివెన్నెల కలం నుంచి జాలువారిన గీతాలు ..ఆణిముత్యాలు: లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీతారామశాస్త్రి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమ,సాహిత్య లోకానికి తీరనిలోటు అని ఆయన పేర్కొన్నారు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన గీతాలు ..ఆణిముత్యాలు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి గారికి అశ్రునివాళి అర్పిస్తున్నానని లోకేష్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తెలిపారు.
సిరివెన్నెల మరణంతో గుండె బరువెక్కుతోంది : చిరంజీవి
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సిరివెన్నెల మనకిక లేదు .. సాహిత్యానికి చీకటి రోజు అంటూ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరు రోజుల క్రితం హాస్పటల్లో జాయిన్ అవ్వడానికి వెళుతున్న సమయంలో తాను మాట్లాడానని సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వ్యక్తిని కోల్పోతే సొంత బంధువును కోల్పోయినట్టుగా, చాలా దగ్గరి ఆత్మీయుడిని కోల్పోయినట్టుగా ఉందని పేర్కొన్నారు. గుండె తరుక్కుపోతోందని, గుండెంతా బరువెక్కి పోతుంది అని తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయన పాటలలో బతికే ఉన్నారు.. ఉంటారు : చిరంజీవి
ఎంతోమందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనకందరికీ, ఈ సాహిత్య లోకమంతటికి అన్యాయం చేశారని ముఖ్యంగా మా లాంటి మిత్రులకు అన్యాయం చేసి వెళ్లిపోయారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఊహించని లోటని చిరంజీవి పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా దూరమయ్యారు కానీ తన పాటలతో ఆయన ఇంకా బతికే ఉన్నారని, తన పాట బ్రతికున్నంత కాలం సిరివెన్నెల కూడా బ్రతికే ఉంటారని చిరంజీవి ఉద్వేగంతో చెప్పారు.
Recommended Video

సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల : బాలకృష్ణ
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగు పాటను తన సాహిత్యంతో దశదిశలా వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సీతారామశాస్త్రి నాకు ఎంతో ఆప్తుడు అంటూ పేర్కొన్న నందమూరి బాలకృష్ణ తాను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగిందని పేర్కొన్నారు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల అంటూ కొనియాడారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కోసం ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం అంటూ పేర్కొన్న బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని వెల్లడించారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications