రవితేజను ఇంకా విచారిస్తున్నాం: సిట్, ప్రశ్నలకు ఆచితూచి సమాధానం
నటుడు రవితేజ విచారణ కొనసాగుతోందని సిట్ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజను సిట్ అధికారులు సమగ్రంగా ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: నటుడు రవితేజ విచారణ కొనసాగుతోందని సిట్ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ఉదయం పది గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన రవితేజను సిట్ అధికారులు సమగ్రంగా ప్రశ్నిస్తున్నారు.
దీంతో విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. రవితేజతో పాటు తాబీర్ అహ్మద్, సయ్యద్ యూనస్‌లను కూడా విచారిస్తున్నట్టు సిట్ తెలిపింది. రేపు (శనివారం) రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజును విచారించనున్నట్టు తెలిపింది.
టాలీవుడ్‌లో పబ్ కల్చర్, పబ్‌లలో డ్రగ్స్ సరఫరా, కెల్విన్, జీషాన్‌తో పరిచయం, విదేశాల టూర్లు, టూర్లలో కార్యక్రమాలు, ఇతర అంశాలపై రవితేజను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, విచారణ సందర్భంగా రవితేజ మధ్యాహ్న భోజనం చేయలేదు. సిట్ అధికారులు భోజనం ఆఫర్ చేసినా రవితేజ తీసుకోలేదు. దీంతో రవితేజకు సిట్ అధికారులు డ్రై ఫ్రూట్స్ అందజేశారు. వాటిని ఆయన తీసుకున్నారు.
సిట్ అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఆచితూచి సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా, పబ్‌లలో డ్రగ్స్ ఉంటాయా? మీరు డ్రగ్స్ తీసుకుంటారా? డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి వారికి అందజేసేవారు? మరోవైపు జిషాన్‌తో పరిచయం ఎలా అయింది? కెల్విన్‌ను జీశాన్ పరిచయం చేశాడా? జీశాన్ ను కెల్విన్ పరిచయం చేశాడా? అతనితో సంబంధాలు ఏంటి? వంటి ప్రశ్నలకు రవితేజ నుంచి సమాధానం రాబడుతున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications