డియర్ కేటీఆర్ అంకుల్..: ఆరేళ్ల చిన్నారి లేఖ, ఎంత గొప్ప మనసో!
హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడంలో ముందుంటారు. బహుశా.. అందుకేనేమో చాలామంది ట్విట్టర్ ద్వారా అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొస్తుంటారు.
తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారి సైతం ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు ఓ లేఖ రాసింది. రోడ్లపై అడుక్కునే చిన్నారులను ఉద్దేశించి ఆ చిన్నారి రాసిన లేఖ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం రాసిందంటే..

'డియర్ కేటీఆర్ అంకుల్...నేను సుప్రియని. వయసు ఆరు సంవత్సరాలు ఆల్వాల్ హిల్స్ లోని సెయింట్ పీయస్ టెన్త్ స్కూల్ లో ఒకటో తరగతి చదువుకుంటున్నాను.
Sir, please thank your little angel on my behalf for her thoughtful letter. I assure her that we will do our best to take care of the children she mentioned
— KTR (@KTRTRS) February 18, 2018
Very sweet of her to offer her kiddie bank savings 😊👏 https://t.co/KDFITlkWoh
సుచిత్రా జంక్షన్ వద్ద పిల్లలు అడుక్కుంటున్నారు. వారికి వసతి సదుపాయం, ఆహారం, విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకోసం నా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 2000 రూపాయలను మిమ్మల్ని కలిసి ఇస్తాను' ఆ లేఖలో చిన్నారి పేర్కొంది.
చిన్నారి తండ్రి నాగేశ్వరరావు మంత్రికేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఈ లేఖను పోస్ట్ చేశారు. చిన్నారి లేఖపై స్పందించిన కేటీఆర్.. 'సార్, మీ పాపకు నీ తరుపున థ్యాంక్స్ చెప్పండి. చిన్నారి చెప్పిన పిల్లల పట్ల తప్పకుండా శ్రద్ద తీసుకుంటాం. ఆ పిల్లల కోసం తన కిడ్డీ బ్యాంక్ డబ్బులు సైతం ఇస్తానని చిన్నారి చెప్పడం చాలా నచ్చింది.' అంటూ ట్వీట్ చేశారు.
ట్విట్టర్‌లో ఆ చిన్నారి లేఖ, దానికి కేటీఆర్ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications