తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్; క్యాబినెట్ హోదాతో కీలక పదవి!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుడిగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో సోమేశ్ కుమార్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారని ఉత్తర్వులలో పేర్కొన్నారు .తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను తన ప్రధాన సలహాదారుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియమించడంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ పై జరిగిన అనేక రకాల ప్రచారాలకు తెరపడింది. ఏపీ ప్రభుత్వ సర్వీస్ నుంచి సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన గురించి పలు ఊహాగానాలు వినిపించాయి. ఆయన రెరా చైర్మన్ అవుతారని, సీఎం కేసీఆర్ సలహాదారుగా నియమితులవుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

అంతేకాదు ఆయన బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకొని త్వరలో ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలలో కీలక భూమిక పోషిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన పై జరిగిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ నేడు తెలంగాణ సీఎం ప్రధాన సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నియామకానికి సంబంధించిన విధి విధానాలు,టర్మ్స్ అండ్ కండిషన్స్ విడిగా జారీ చేయబడతాయని పేర్కొన్నారు.
1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్న ఆయన,తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక శాఖలలో కీలక పదవులు నిర్వహించి, 2019 డిసెంబర్లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని ఆయన సవాల్ చేసి క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా తీర్పు ఇవ్వగా ఆపై క్యాట్ ఇచ్చిన ఆర్డర్ ను నిలిపివేయాలని కోరుతూ డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది.
ఇక దీనిని విచారించిన తెలంగాణ హైకోర్టు సోమేశ్ కుమార్ ను తెలంగాణ కేడర్ కు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చినఉత్తర్వులు రద్దు చేసి ఆయనను ఏపీకి వెళ్లవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలో రిలీవ్ అయిన ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు. ఆపై కొద్దిరోజులకే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేయడంతో మళ్లీ సోమేశ్ కుమార్ తెలంగాణలో పరిపాలనలో కానీ, రాజకీయాల్లో కానీ కీలక భూమిక పోషిస్రతాని అందరూ భావించారు. అదేవిధంగా సోమేశ్ కుమార్ ను సీఎం ప్రధాన సలహాదారుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications