రేవంత్ ప్రమాణ స్వీకారానికి సోనియా, చంద్రబాబు, కేసీఆర్ - జగన్ కు ఆహ్వానం..!!
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు వేదిక..ముహూర్తం ఇప్పటికే ఖరారైంది. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సింది సోనియా,రాహుల్, ప్రియాంక, ఖర్గే లను రేవంత్ స్వయంగా ఆహ్వానించారు. సోనియా గాంధీ, రాహుల్ హైదరాబాద్ లో జరిగే రేవంత్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లను ఆహ్వానిస్తుండటంతో వారిలో ఎవరు హాజరవుతారనేది ఆసక్తిగా మారుతోంది.
రేవంత్ ప్రమాణ స్వీకారం
రేవంత్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం తరలి వస్తుంది. ఇక..కేసీఆర్ తన పాలన ఎలా ఉంటుందనేది గెలిచిన తరువాత జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేసారు. కేసీఆర్ తో సహా అందరినీ కలుపుకుపోతామని స్పష్టం చేసారు. రేవంత్ రాజకీయ జీవితం ఆరంభంలో బీఆర్ఎస్ లో పని చేసారు.

కేసీఆర్ ఓటమి లక్ష్యంగా పని చేసిన రేవంత్..ఇప్పుడు స్వయంగా కేసీఆర్ ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, కేసీఆర్ హాజరవుతారా లేక కేటీఆర్ వస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు..ఏపీ సీఎం జగన్... పవన్ కల్యాన్ ను రేవంత్ వ్యక్తిగతంగా ఆహ్వానించాలని నిర్ణయించారు.
చంద్రబాబు - జగన్ కు ఆహ్వానం
చంద్రబాబు రేపు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావటం పైన ఇంకా క్లారిటీ రాలేదు. రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే, టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యేలగా..చంద్రబాబు విధేయుడిగా గతంలో పని చేసిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటు కు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లిన సమయంలో కుమార్తె నిశ్చితార్ధంకు చంద్రబాబు - భువనేశ్వరి హాజరు అయ్యారు.

దగ్గర ఉండి పెద్దరికంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఇప్పుడు పార్టీలు వేరైనా..వ్యక్తిగత సంబంధాలతో హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ను రేవంత్ ఆహ్వానించనున్నారు. కానీ, ఏపీలో తుఫాను పరిస్థితుల కారణంగా ఏపీ నుంచి మంత్రి బుగ్గన హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రముఖల హాజరుపై ఆసక్తి
జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వస్తారా రారా అనేది క్లారిటీ లేదు. జనసేన ప్రతినిధిగా నాదెండ్ల మనోహర్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో మనోహర్ స్పీకర్ గా పని చేసిన సమయంలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించాలని రేవంత్ నిర్ణయించారు.

దీంతో..రేవంత్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ హాజరు పైన ఆసక్తి కనిపిస్తోంది. అదే విధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సైతం రానున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక నుంచే అందరి సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పైన తొలి సంతకం చేయనున్నారు.












Click it and Unblock the Notifications