నాంపల్లి- శబరిమల ప్రత్యేక రైళ్లకు ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే..!!

Sabarimala temple: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.

మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు కిందటి నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.

South Central Railway to run 22 Additional Services for Sabarimala Devotees

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొల్లం వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్యనూ పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో 22 అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ నాంపల్లి నుంచి మధ్యాహ్నం 12:05 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07137 రైలు మరుసటి రోజు సాయంత్రం 6:45 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది. ఈ నెల 14 తేదీన రాత్రి 9:45 నిమిషాలకు కొట్టాయం నుంచి బయలుదేరే నంబర్ 07138 ఎక్స్‌ప్రెస్ రెండో రోజు మధ్యాహ్నం 12:50 నిమిషాలకు నాంపల్లికి చేరుకుంటుంది.

ఈ రైలు- సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

ఈ నెల 20, 27 తేదీల్లో నాంపల్లి నుంచి మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరే నంబర్ 07163 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు సాయంత్రం 6:45 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది. 21, 28 తేదీల్లో కొట్టాయం నుంచి రాత్రి 9:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07164 రెండో రోజు మధ్యాహ్నం 12:30 నిమిషాలకు నాంపల్లికి చేరుకుంటుంది.

ఈ రైలు- బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+