రామ్ చరణ్, సానియా మీర్జా, కేటీఆర్, రాశికన్నా... వీరంతా ఓ చోట కలిస్తే.. ఓ సెల్ఫీ

భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్డులో ఫ్రీడమ్ 10కే, 5 కే రన్‌ను నిర్వహించారు. ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్, ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు.

హైదరాబాద్: భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్డులో ఫ్రీడమ్ 10కే, 5 కే రన్‌ను నిర్వహించారు. ఆదివారం ఉదయం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు.

Star studded start for Hyderabad 10k, flagged off by KTR, Ram Charan and Sania Mirza

ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, టెన్నిస్ తార సానియా మీర్జా, హీరోయిన్ రాశీకన్నా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, సానియా, రామ్ చరణ్, రాశికన్నా, బొంతు రామ్మోహన్ తదితరులు సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని కేటీఆర్, సానియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఈ 10 కె రన్ స్టార్లతో కళకళలాడింది. కేటీఆర్‌, సినీతారలు రామ్‌చరణ్‌, రాశిఖన్నా, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తదితరులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిని చూసేందుకు ప్రజలూ ఆసక్తి చూపారు.

కేటీఆర్‌, రామ్ చరణ్‌ తేజ, సానియా మీర్జా, రాశి ఖన్నా కలిసి సెల్ఫీ తీసుకున్నారు. తారలతో కళకళలాడుతున్న ఈ సెల్ఫీ ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఏదైనా కార్యక్రమానికి ఓ సెలబ్రిటీ వస్తేనే హడావుడి ఉంటుంది. అలాంటిది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరూ ఒక్కచోటే కలిస్తే ఆ సందడి మరింత ఎక్కువవుతుంది. 10కె రన్‌లోను అదే కనిపించింది. కాగా, ఈ రన్‌లో పాల్గొనేందుకు వేలాది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. శనివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ రన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హెల్త్ అండ్ ఫిట్ నెస్ ఎక్స్ పోలో పలువురు తమ పేర్లు నమోదు చేసుకొని, టీ షర్టులతో పాటు నియమ నిబంధ పత్రాలను పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+