ఉత్సవాలు ఓయూలో చేయండి, ట్యాంక్ బండ్ పై కాదు.. : రేవంత్ డిమాండ్
హైదరాబాద్ : ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మునుపటి ఫైర్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ చర్యలపై మండిపడ్డ ఆయన ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థులను, తెలంగాణ అమరులను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ కారు చీకట్లలో మగ్గిపోతుందని మండిపడ్డ రేవంత్, ఉద్యమం కోసం పనిచేసిన విద్యార్థులను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవితాలను సైతం పణంగా పెట్టి విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నారని అలాంటి వారికి ప్రభుత్వం కనీస గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఇక తెలంగాణ ద్వితీయ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల గురించి ప్రస్తావించిన ఆయన, ప్రభుత్వం ఉత్సవాలు చేయాల్సింది ట్యాంక్ బండ్ పై కాదని, ఉస్మానియా యూనివర్సిటీలో చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే తెలంగాణ కోసం అమరులైన వారికి ఐదెకరాల భూమి, ఇల్లు, రూ.10 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించామని కానీ, రెండేళ్లయినా ప్రభుత్వం ఆ తీర్మానాన్ని పట్టించుకోలేదన్నారు.

ఇక త్వరలో రాజ్యసభ ఎన్నిలు జరగనున్నందునా..! అమరవీరుల కుటుంబాలకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ విద్యార్థుల డిమాండ్స్ పై టీడీపీ మహానాడులో చర్చించబోతున్నట్టుగా తెలియజేశారు.
బుధవారం ఉదయం రేవంత్ ని కలిసిన ఓయూ జేఏసీ నేతలు జూన్ 2న క్యాంపస్ లో జరగబోయే జనజాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. జనజాతరకు తన తరపున మద్దతును ప్రకటించారు.
-
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications