మరో వివాదంలో ఎమ్మెల్యే రాజయ్య: తమ్ముడికి దళితబంధు; మండిపడుతున్న ప్రతిపక్షాలు
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం, నిరుపేద దళితుల బాగు కోసం తెలంగాణ సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం పక్కదారి పడుతోంది. సాక్షాత్తు ఎమ్మెల్యేలే తమ కుటుంబ సభ్యులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నారు అని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దళిత బంధు పథకం ద్వారా టిఆర్ఎస్ కార్యకర్తలకు మేలు జరుగుతుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

దళిత బంధు పథకంపై విమర్శల వెల్లువ
దళిత బంధు పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు అప్పగించడంతో, ఎమ్మెల్యేలు అస్మదీయులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేశారనే విమర్శలు వస్తున్నాయి. దళితులను ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చి దశలవారీగా దళితులకు ఈ పథకం కింద పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలోనూ వంద కుటుంబాలకు లబ్ధి చేకూర్చనున్నారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ప్రజాప్రతినిధులకు అప్పగించారు.

దళిత బంధు పథకంలో లబ్దిదారులుగా ఎమ్మెల్యే రాజయ్య సోదరుడు
పేద దళితుల ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారులుగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోదరుడు స్టేషన్ ఘనపూర్ సర్పంచి తాటికొండ సురేష్ కుమార్ ఉండడంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది. ఇక దళిత బంధు లబ్ధిదారుల జాబితాలో ఘన్పూర్ ఎంపీపీ భర్త తో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులు ఉండడం విమర్శలకు కారణంగా మారింది. రఘునాథ్ పల్లి జడ్పి టి సి అజయ్ కుమార్ పేరు కూడా లిస్టులో ఉందని సమాచారం.

దళిత బంధు దుర్వినియోగం అవుతుందని ప్రతిపక్షాల మండిపాటు
ఎమ్మెల్యేల ఒత్తిడితో అర్హులను పక్కనపెట్టి ప్రజాప్రతినిధుల బంధువులకు, అస్మదీయులకు కొమ్ముకాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో ఉన్న పేదవారిని కాదని ఆర్థికంగా ఉన్న వారికి, ఎమ్మెల్యే అనుచరులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేశారు అని కాంగ్రెస్, బిజెపి నాయకులు మండిపడుతున్నారు. ఒక జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. దళిత బంధు పథకం ద్వారా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు లబ్ధి జరుగుతుందని, నిరుపేద దళితులకు ఎటువంటి న్యాయం జరగడం లేదని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications