సమ్మర్​ లో డార్జిలింగ్​, సిక్కిం టూర్.. 8 రోజులు ఫుల్​ ఎంజాయ్​!

సమ్మర్ సెలవులు వచ్చేశాయి. బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? వేసవి సెలవులు అనగానే చాలామంది బంధువుల ఇంటికి, సొంతూళ్లకు అలాగే దేవస్థానాలకు వెళ్తుంటారు. అయితే మండే ఎండలో చల్లని ప్రదేశాలకు టూర్ కు వెళ్తే ఆ కిక్కే వేరు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. వేసవిలో కూల్ గా ఉండే డార్జిలింగ్, సిక్కిం టూర్ కు వెళ్లాలని ఉందా..? అయితే మీకోసం రైల్వేశాఖ బంపరాఫర్ తీసుకొచ్చింది. తక్కువ ధరకే డార్జిలింగ్, సిక్కిం అందాలను వీక్షించవచ్చు. ఈ అద్భుతమైన టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

డార్జిలింగ్ ప్రాంతం పశ్చిమ్ బెంగాల్ లోని అందమైన ప్రాంతం. ముఖ్యంగా వేసవిలో ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు తనివితీరా చూసేందుకు సమ్మర్ లో ఈ ప్రాంతాలకు అత్యధికంగా టూరిస్టులు వెళ్తుంటారు. ఈ టూర్ మొత్తం 7 రాత్రుళ్లు, 8 పగళ్లు సాగుతుంది. ఇక హైదరాబాద్ నుంచి విమాన జర్నీ ద్వారా ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా కాలింపాంగ్, గ్యాంగ్ టక్ సహా పలు ప్రాంతాల్లో విహరించవచ్చు. ఈ టూర్ లో భాగంగా ముందుగా హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ఉంటుంది. ఉదయం 10 గంటలకు ఫ్లైట్ జర్నీ ఉంటుంది. అలా హైదరాబాద్ నుంచి డార్జిలింగ్ చేరుకుంటారు.

మరుసటిరోజు డార్జిలింగ్ నుంచి టైగర్ హిల్స్ కు వెళ్తారు. టైగర్ హిల్స్ లో సందర్శన తర్వాత అక్కడినుంచి బటాసియా లూప్ ను సందర్శిస్తారు. రాత్రికి డార్జిలింగ్ లోనే బస చేస్తారు. ఆ తర్వాత హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్ స్టిట్యూట్, పద్మజానాయుడు హిమాలయన్ జూ పార్క్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత టిబెటన్ శరణార్థి కేంద్రం, టీ గార్డెన్ సహా పలు టూరిస్టు ప్రాంతాలను విజిట్ చేస్తారు. అనంతరం మంగళ్ ధామ్, డియోలో హిల్, డాక్టర్ గ్రాహం హోమ్, డర్ఫిన్ దారా హిల్స్ ను సందర్శిస్తారు. ఇక ఐదోరోజు గ్యాంగ్ టక్ లోని అనేక టూరిస్టు ప్రాంతాలను కవర్ చేస్తారు.

Summer Tour to Darjeeling amp amp Sikkim Enjoy 8 Days of Pure Bliss and Adventure Full Details Here now

మరుసటిరోజు సోమ్గో సరస్సు ను సందర్శన ఉంటుంది. అలాగే ఎనిమిదోరోజు సిలిగురిలో పర్యటన ఉంటుంది. ఆ రాత్రికి సిలిగురిలో పర్యటన తర్వాత మరుసటిరోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఇక ఈ టూర్ కు సంబంధించిన టికెట్ ధరలు రూ. 34 వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+