సరికొత్తగా సీఎం రేవంత్ విలేజ్.. దేశంలోనే తొలి గ్రామంగా రికార్డు..

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి చరిత్ర సృష్టించింది. దేశంలో తొలి సౌర విద్యుత్ గ్రామంగా రికార్డు నెలకొల్పింది. సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సౌర గ్రామంగా రికార్డులకెక్కింది. ఈ మేరకు రెడ్కో అధికారులు చేపట్టిన పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. నాగర్‌‌కర్నూలు జిల్లా వంగూర్ మండలంలో ఉన్న ఈ కొండారెడ్డిపల్లి ఈ ఘనత సాధించింది.

సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి దూసుకెళ్తోంది. ప్రస్తుతం సంపూర్ణ సౌర విద్యుత్ కలిగిన దక్షిణ భారత్ లోనే మొదటి, దేశంలో రెండో గ్రామంగా చరిత్రలో నిలువనుంది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే పూర్తిస్థాయి సోలరైజ్డ్ గ్రామంగా ఏర్పాటు చేయాలని అధికారులకు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రూ.10.53 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కారణంగా గ్రామస్తులకు కరెంటు బిల్లులు లేవు. అదనంగా విద్యుత్ ఎగుమతి ద్వారా ఆదాయం వస్తోంది. ఇది రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనానికి ఒక మైలురాయిగా నిలిచింది.

గతంలో సీఎం ఆదేశాల మేరకు కొండారెడ్డిప‌ల్లిని రాష్ట్రంలో మోడ‌ల్ సోలార్ విలేజ్‌గా మార్చేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీజీరెడ్కో) ప్రణాళికలు చేపట్టింది. రెడ్కో చేపట్టిన పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ప్రణాళికలో భాగంగా కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక ప్రస్తుతం ఈ గ్రామంలో 514 ఇళ్లు, 11 ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. వీటిపై రూ.10.53 కోట్లతో సౌర విద్యుత్ పనులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Sunlit Legacy Revanth Reddy s Hometown Shines as South India s First Solar-Powered Village

కొండారెడ్డిపల్లిలోని ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన సౌర ఫలకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతోపాటు గ్రామంలోని ప్రభుత్వ భవనాలపై 60 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెడ్కో చేపట్టిన పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు కొండారెడ్డిపల్లిలో 34 ఇళ్లు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికయ్యాయి. ఆ ఇళ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తి అయిన వెంటనే ఆ ఇండ్లపై కూడా సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ 34 ఇండ్లపైనా సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తే కొండారెడ్డి పల్లి గ్రామం మెుత్తం సౌర విద్యుత్ గ్రామంగా మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+