చంద్రగ్రహణం: సూపర్ బ్లడ్ మూన్‌ను చూడొచ్చా, జాగ్రత్తలు పాటించాలా? బిర్లాలో టెలిస్కోప్‌లు
హైదరాబాద్: ఆకాశంలో మరికొద్ది సేపట్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. పండు వెన్నెలను పంచే చంద్రుడు బుధవారం రాత్రి అత్యంత అరుదైన రూపంలో దర్శనమివ్వనున్నాడు. సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్‌ల రూపంలో ఒకేసారి కనిపించనున్నాడు. దీనిని సూపర్ బ్లూ బ్లడ్ మూన్‌గా పిలుస్తున్నారు.
ఇలాంటి అరుదైన దృశ్యం చివరిసారి 1982లో చోటు చేసుకుంది. ఇలాంటిది మళ్లీ 2037లో వస్తుంది. భ్రమణ సమయంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమిని సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కాస్త పెద్దగా కనిపిస్తాడు.

మూడు కలిసి రావడం అత్యంత అరుదు
మరోవైపు ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. చంద్రగ్రహణం రోజు ఒక్కోసారి భూమి వాతావరణం గుండా చంద్రుడిపై సూర్యకిరణాలు పడతాయి. దీంతో చంద్రుడు గోధుమ వర్ణంలో కనిపిస్తాడు. ఈ పరిణామాన్ని బ్లడ్ మూన్‌గా చెబుతారు. బ్లూ, బ్లడ్, సూపర్ మూన్‌లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మూడు కలిసి రావడం అత్యంత అరుదు.

ఈ సమయం నుంచి ఈ సమయం వరకు చూడవచ్చు
ఇది భారత్‌లో సాయంత్రం గం.5.20 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం మొదలవుతుందని హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీజీ సిద్ధార్థ్ తెలిపారు. సూర్యా స్తమయం (6.25 గంటల) దాటిన తర్వాత ఆకాశంలో తూర్పు వైపు ఈ పరిణామాన్ని చూడవచ్చునని పేర్కొన్నారు. 7.25 వరకూ ఇది కొనసాగుతుందన్నారు.

ఇక్కడ టెలిస్కోప్‌లు అందుబాటులో
గ్రహణ సమయంలో బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారమే చెప్పారు. ఇక్కడ టెలిస్కోప్‌లు అందుబాటులో ఉంటాయి.

ఏం జాగ్రత్తలు తీసుకోవాలి
ఈ గ్రహణాన్ని సాధారణ కంటితో చూసినా ఇబ్బందులు లేవని చెబుతున్నారు. సాధారణంగా గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదని చెబుతారు. సూర్యగ్రహణం అయితే అల్ట్రా వయోలేట్ కిరణాలు నేరుగా తాకడం వల్ల కాస్తా హానీ జరగవచ్చు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని అందుకే చెబుతారు. అయితే చంద్రగ్రహణాన్ని నేరుగా చూడవచ్చునని చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఏమీ తినరాదనేది కూడా అపోహే అంటున్నారు. దానికి శాస్త్రీయంగా ఎలాంటి నిరూపణలు లేవని చెబుతున్నారు. అనుమానం ఉన్న వారు టెలిస్కోప్‌ల ద్వారా చూడవచ్చు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో












Click it and Unblock the Notifications