ఆ రంగంలో ప్రపంచ టాప్–3లో ఒకటిగా.. రేవంత్ సర్కార్ సూపర్ పాలసీ !

2030 నాటికి ప్రపంచ టాప్-3 లైఫ్ సైన్సెస్ హబ్‌గా ఆవిర్భవించటం తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా దావోస్‌లో తెలంగాణ నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ని తెలంగాణా ప్రభుత్వం విడుదల చేస్తోంది . ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ తెలంగాణా రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేసేలా ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ నెక్ట్స్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030
.ఈ నేపథ్యంలో తెలంగాణ నెక్ట్స్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2026 సందర్భంగా డావోస్‌లో ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అంతర్జాతీయ పరిశ్రమ నాయకులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పాలసీ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలవనుంది.

super news Telangana to unveil Next Gen Life Sciences Policy 2026 2030

టాప్-3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణా
ఈ కొత్త పాలసీ ద్వారా తెలంగాణ తన స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ను మరింత బలోపేతం చేస్తూనే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ప్రపంచ స్థాయి పోటికి సిద్ధమవుతోంది. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్-3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టుకు రోడ్ మ్యాప్
దావోస్ వేదికగా ప్రపంచ స్థాయి, సస్టైనబుల్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌ను అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీ గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టుకు ఈ పాలసీ స్పష్టమైన వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనుంది . భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటు కానున్న ఈ గ్రీన్ ఫార్మా సిటీకి ఎమర్జింగ్ AI హబ్‌తో పాటు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలకు అద్భుతమైన కనెక్టివిటీ కూడా ఉండనుంది.

Genome Valleyలో '1 Bio' ప్రత్యేకకేంద్రం
జీరో లిక్విడ్ డిశ్చార్జ్, సెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ వంటి పర్యావరణ హిత విధానాలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. "వర్క్, లైవ్, లెర్న్ అండ్ ప్లే సిద్ధాంతంతో ప్రపంచస్థాయి లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌ను ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. అంతేకాదు Genome Valleyలో '1 Bio' ప్రత్యేకకేంద్రం కూడా ఏర్పాటు చేయనుంది. ఇది స్టార్టప్‌ల నుంచి గ్లోబల్ స్థాయి బయోఫార్మా కంపెనీల వరకు వేగవంతమైన అభివృద్ధికి కీలకంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+