
నల్లగొండ జిల్లాలో రెచ్చిపోయిన సిరంజీ సైకో
నల్లగొండ: మిస్టరీగా మారిన సిరంజి సైకో మరోసారి రెచ్చిపోయాడు. జిల్లాలోని మేళ్ల చెరువు మండలం దొండపాడులో నడుచుకుంటు వెళ్తున్న ఓ వ్యక్తిని సూది సైకో సిరంజ్‌తో గుచ్చి పారిపోయాడు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన ఈ సిరంజీ దాడుల పరంపర కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు పాకింది. కొద్ది రోజుల క్రితం నగరంలోని మల్కాజిగిరి, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తి సూదితో పొడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
సోమవారం సిరంజీ సైకో దాడి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో రెండు చోట్ల జరిగాయి. నల్లగొండ జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన రైతు కోపూరి వీరయ్య సోమవారం సాయంత్రం కోదాడ నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఎదురుగా ఓ ఆటో మీదికి దూసుకురావడంతో రోడ్డు పక్కకు నిలిపాడు.

మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లితండాకు చెందిన స్వామినాయక్(31) బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటున్నాడు. సైఫాబాద్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయంలో రీజినల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం సైఫాబాద్ నుంచి బీఎన్‌రెడ్డినగర్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. ఎల్బీనగర్ సమీపంలోకి బస్సు రాగానే పక్కను న్న ఓ వ్యక్తి స్వామినాయక్‌కు ఇంజక్షన్ ఇచ్చి పారిపోయినట్లు చెబుతున్నాడు.
స్వామినాయక్ ఎల్బీనగర్ చౌరస్తా వద్ద దిగి ఆరెంజ్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. సూది దాడి జరిగినట్లు అనవాళ్లు కన్పించలేదని వైద్యులు తెలిపారు. అయినా, వైద్యం కొనసాగించేందుకు వైద్యులు ప్రయత్నించగా, తనకు హెల్త్ కార్డు ఉందని, దాని ఆధారంగా వైద్యం చేయించుకుంటానని అతను ఆ సుపత్రి నుంచి వెళ్లిపోయాడు. అయితే సూది దాడి జరిగిందని కచ్ఛితమైన ఆధారం లేకపోయినా సైకో సూది దాడి అంటూ కలకలం రేగింది.