చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్ నే తలచుకుంటున్నారట... తలసాని మాట

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదన్న తలసాని కెసిఆర్ పేరును అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు.. కేసీఆర్ పేరును నిద్రలో కూడా తలుచుకుంటున్నారని తలసాని ఎద్దేవా చేశారు. కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నాడని, హైదరాబాదులో ఆంధ్రులను కొడుతున్నారని వారి ఆస్తులు లాగేసుకున్నారని ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని తలసాని మండిపడ్డారు.

చంద్రబాబుకు సిగ్గులేకుండా సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. హైదరాబాద్లో అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుత ఏపీ రాజకీయాలు కేసీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి అని వ్యాఖ్యానించారు.

Talasani sensation ..Even chandrababu is in sleep he is uttering KCR name

ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనన్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. చంద్రబాబుపై మండి పడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్, బీజేపీలను ఇంటికి పంపే రోజు దగ్గర్లోనే ఉందని తలసాని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు.. కేసీఆర్ పేరును నిద్రలో కూడా తలుచుకుంటున్నారని తలసాని ఎద్దేవా చేశారు. ఎల్‌బి స్టేడియంలో శుక్రవారం జరిగే కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చిన ఆయన బాబుపై మాత్రం ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+