బంజారాహిల్స్‌లో భారీ రేవ్ పార్టీ - 150 మంది అరెస్ట్ : బిగ్ బాస్ విన్నర్ సైతం..!!
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఈ తరహాలో పార్టీలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో..వీటి పైన నిఘా పెట్టిన పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారదు. తాజాగా బంజారాహిల్స్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు రాడిసన్ బ్లూ హోటల్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రముఖుల పిల్లలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. పబ్ యజమానులతో సహా 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ దాడుల్లో డ్రగ్స్ సైతం దొరికినట్లుగా చెబుతున్నారు.
తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే, ఈ దాడుల్లో బిగ్‌బాస్ తెలుగు విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు బంజారా హీల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ పోలీసు స్టేషన్ లో వారు హంగామా సృష్టించారు. అరెస్ట్ చేసిన 150 మందిలో 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. గతంలో హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫాం హౌస్ లు.. రిసార్ట్ లు కేంద్రంగా ఇటువంటి రేవ్ పార్టీలు జరిగేవి.

అనేక సార్లు పోలీసులు వాటిని భగ్నం చేసారు. కానీ, ఇప్పుడు నగర నడిబొడ్డునే ఇటువంటి జరగటం పైన పోలీసులు నిర్వాహకుల పైన చర్యలకు సిద్దం అవుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖలు పిల్లలు ఉండటంతో ఎవరెవరు ఉన్నారనేది బయటకు రాలేదు. అయితే, వీకెండ్ కావటంతో ఈ పార్టీకి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ విన్నర్.. సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ వారిలో ఉన్నారనే విషయం పైన అధికారికంగా సమాచారం అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications