చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ - రేవంత్ వాట్ నెక్స్ట్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు. సంస్థాగతంగా బలంగా ఉన్న తెలంగాణలో తిరిగి రాజకీయంగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు తాజాగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. పక్కా వ్యూహంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లు స్ఫష్టం అవుతోంది. అదే సమయంలో ఏపీ తరహా పొత్తులు తెలంగాణలోనూ అమలు చేసే ప్రణాళికలతో సిద్దం అవుతున్నారు. మరి..రేవంత్ ఈ రాజకీయ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారు.

చంద్రబాబు అడుగులు
తెలంగాణలో చంద్రబాబు అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం పైన ఎక్కువగా ఫోకస్ చేసారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి క్యూకడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసేందుకు హస్తం పార్టీ తన ప్రణాళికలు రూపొందిస్తుంది. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోవాలనే ఆలోచన చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

TDP Cheif Chandra Babu To strengthen the party for GHMC Elections alliance with BJP

జీహెచ్ఎంసీపై ఫోకస్
ఈ సమయంలోనే చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో పూర్వవైభవం సాధిస్తామని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన గడ్డపై తెలుగుదేశం పార్టీ మళ్లీ బలపడుతుందంటూ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేయలేదు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసినా ఆ పార్టీ ఒక్కసీటు గెలుచుకోలేదు. మరో ఏడాదిన్నరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.

రేవంత్ ప్లాన్ ఏంటి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పునర్వైభవం సాధించే వీలుటుందని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ఎన్డీయే మిత్రపక్షంగా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీజేపీ బలంగా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఏపీ కాంబినేషన్‌ను రిపీట్ చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో గ్రేటర్ పైన కన్నేసిన సీఎం రేవంత్..చంద్రబాబు ప్రయత్నాలను ధీటుగా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+