చంద్ర‌బాబు వ్యూహం: తెలంగాణ‌పై దృష్టిసారించిన తెలుగుదేశం పార్టీ?

తెలుగుదేశం పార్టీ తెలంగాణ‌పై దృష్టిసారించింది. 2014లో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో మ‌రే పార్టీ లేదు.. ఒక్క టీఆర్ ఎస్ మాత్ర‌మే అనే భావ‌న‌ను కేసీఆర్ ప్ర‌జ‌ల్లో తీసుకురాగ‌లిగారు. రెండోసారి ఎన్నిక‌ల్లో కూడా విజ‌యం సాధించారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు మారుతున్నాయి. టీఆర్ ఎస్‌కు పోటీగా కాంగ్రెస్‌, బీజేపీ సై అంటున్నాయి. వైఎస్ ష‌ర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. స‌రిగ్గా ఇటువంటి స‌మ‌యంలోనే చంద్ర‌బాబు తెలంగాణ‌పై దృష్టిసారించారు.

24న ఖమ్మంలో పర్యటించనున్న చంద్రబాబు

24న ఖమ్మంలో పర్యటించనున్న చంద్రబాబు

సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లా పర్యట‌న‌కు వెళ్ల‌బోతున్నారు. ఈనెల 24వ తేదీన ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌బోతున్నారు. దీన్ని ఐదు సంవ‌త్స‌రాల కింద‌టే ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ స్థానిక నాయ‌కులు చంద్ర‌బాబుచేతే ఆవిష్క‌రింప‌చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఇంత‌వ‌ర‌కు ఓపిగ్గా ఎదురు చూశారు.

తాజాగా ఆయ‌న కూడా అంగీక‌రించ‌డంతో బాబు స్వాగ‌తానికి భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మంతో తెలంగాణ‌లో చంద్ర‌బాబు కూడా రేసులోకి వ‌చ్చిన‌ట్లేన‌ని సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ?

కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ?

రెండుసార్లు ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క స్థానాన్నే గెలుచుకోగ‌లుగుతోంది. ఆ త‌ర్వాత విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుంటోంది. కానీ ఓట‌ర్ల మ‌న‌సుల్ని గెలుచుకోలేక‌పోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఉమ్మ‌డి హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల‌తోపాటు ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, న‌ల్గొండ జిల్లాల ప‌రిధిలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈసారి పోటీకి తెలుగుదేశం పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. ఆ పార్టీకి ఆయా జిల్లాల్లో క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉండ‌ట‌మే కార‌ణం.

టీడీపీ సత్తా నిరూపించడానికే..

టీడీపీ సత్తా నిరూపించడానికే..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఉన్న స‌మ‌యంలో ఏపీక‌న్నా తెలంగాణ‌లోనే తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌ల బ‌లం ఎక్కువ‌. త‌ద‌నంత‌ర ప‌రిణామాల దృష్ట్యా వారంతా ఇత‌ర పార్టీల‌కు ఓటు వేస్తున్న‌ప్ప‌టికీ టీడీపీకి ఆయా ప్రాంతాల్లో మంచి అవ‌కాశాలున్నాయ‌ని భావిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సజీవంగానే ఉందని నిరూపించడానికి, జాతీయ పార్టీగా ఉన్న అర్హతను నిలబెట్టుకోవడానికి చంద్రబాబు ఈసారి తెలంగాణపై గట్టిగా దృష్టి సారిస్తున్నారని పార్టీ నేతలే వెల్లడిస్తున్నారు.

ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది? ఎన్ని సీట్లను గెలుచుకోవచ్చు? ఎంతమేరకు ఓట్ల శాతం రాబడుతుంది? తెలుగుదేశం పార్టీ పోటీచేయడంవల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? తదితర విషయాలపై స్పష్టత రావాలంటే కొన్నిరోజులు వేచిచూడక తప్పదు.!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+